రేపు మంత్రి మండలి సమావేశం కానుంది. మండలి భేటీపై ఈ నెల 9న సీఎస్ కార్యాలయం నోట్ ఇవ్వగా..ఇప్పటికే వివిధ శాఖలు కేబినేట్ అజెండాను ప్రభుత్వానికి పంపాయి. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, ఆక్సిజన్ నిల్వలు, రెమిడిసివిర్, పడకలు, కొవిడ్ కేర్ సెంటర్లు, ఆంక్షలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
కాగా..మంత్రివర్గ సమావేశం సచివాలయ మొదటి బ్లాక్‌లో జరపడంపై సందిగ్ధత నెలకొంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్ భేటీ జరిపే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ జరిపే అవకాశం ఉంది.
ఇదీచదవండి
జగన్ బెయిల్ రద్దుపై రఘురామకృష్ణరాజు పిటిషన్.. విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు