ETV Bharat / city

కరోనా బాధితులకు ఫోన్ ద్వారా వారే సలహాలు, సూచనలిస్తారు: సింఘాల్ - అనిల్ కుమార్ సింఘాల్ తాజా వార్తలు

కాల్ సెంటర్ ద్వారా కరోనా బాధితులకు సేవలు అందించడానికి అధిక సంఖ్యలో డాక్టర్లు ముందుకొస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనీల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. ప్రస్తుతం 3,220 డాక్టర్లు.. కరోనా బాధితులకు ఫోన్ల ద్వారా సేవలందించడానికి ముందుకొచ్చారని తెలిపారు.

anil kumar singhal review on covid
anil kumar singhal review on covid
author img

By

Published : May 6, 2021, 3:41 AM IST

కరోనా బాధితులకు ఫోన్ ద్వారా సలహాలు సూచనలు అందించాలని కోరినప్పుడు తొలుత 200 మంది డాక్టర్లు మాత్రమే తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారని అనీల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం 3,220 డాక్టర్లు ఫోన్ల ద్వారా సేవలు అందించడానికి ముందుకొచ్చినట్లు వెల్లడించారు. హోమ్ ఐసోలేషన్​లో ఎలా ఉండాలి? తక్కువ లక్షణాలు ఉన్నప్పుడు ఏ విధమైన మందులు వాడాలి? తీవ్రంగా ఉన్నపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలను కరోనా బాధితులకు ఫోన్ ద్వారా తమ ఇళ్ల నుంచే డాక్టర్లు సలహాలు సూచనలు అందజేస్తున్నారన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కొవిడ్ నియంత్రణకు ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం ప్రత్యేకంగా సమావేశమై తాజా పరిస్థితులను సమీక్షించిన అనంతరం సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తున్నామని సింఘాల్​ చెప్పారు. మొదటి రెండు రోజులు కొవిడ్ మార్గదర్శకాలపై ప్రజల్లో అవగాహన లోపం ఉంటుందని, ఎవరికీ ఇబ్బందులు పెట్టొద్దని జిల్లా అధికారులను, కలెక్టర్లను ఆదేశించామన్నారు. ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు ముందుగానే నిర్ణయించుకున్న పెళ్లి తదితర కార్యక్రమాల నిర్వహణ, రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మార్గదర్శకాలు రూపొందించామన్నారు. కొవిడ్ మార్గదర్శకాలపై జిల్లా అధికారులతో ఏరోజుకారోజు సమీక్షలు చేస్తామన్నారు.

ఆరోగ్య శ్రీ రోగులకు ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనపైనా జిల్లా అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని సింఘాల్ అన్నారు. ఇతర దేశాల నుంచి వస్తున్న విరాళాలను కేంద్ర ప్రభుత్వం.. వివిధ రాష్ట్రాలకు పంపుతోందని తెలిపారు. ఇందుకు ప్రతి రాష్ట్రం ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం తెలిపిందన్నారు. రాష్ట్రానికి కు 4,879 రెమిడెసివిర్ ఇంజక్షన్లు, 2,107 ఆక్సిజన్ పరికరాలను, 1, 92,058 లక్ష ర్యాపిడ్ కిట్లతో పాటు మరికొన్నింటిని కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు.

రాష్ట్రంలో కరోనా టీకా మొదటి డోస్ వేసుకున్న అందరికీ రెండో విడత టీకా వేస్తామని.. ఎవరూ భయాందోళనలకు, అపోహాలకు గురికావొద్దని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కోరారు. ఈ నెలలో కేంద్రం ఇచ్చే డోస్ లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసే డోస్ లను నిర్ధేశించిన సమాయానికే రెండో విడత టీకో కోసం వినియోగిస్తామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రభుత్వ అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమ్​డెసివిర్, ఆక్సిజన్ కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఇదీ చదవండి: స్ట్రెయిన్ ఎన్440కె పై ప్రభుత్వం అప్రమత్తంగా లేదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.