ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ ప్రధాన వార్తలు

ప్రధాన వార్తలు @ 9PM
ప్రధాన వార్తలు @ 9PM
author img

By

Published : Dec 10, 2020, 9:01 PM IST

  • జగనన్న జీవక్రాంతి

జగనన్న జీవ క్రాంతి పథకాన్ని.. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. పథకం ప్రారంభం అనంతరం కలెక్టర్లు, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాడి రైతులు, మహిళలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఏలూరు వింత వ్యాధి: ఆసుపత్రికి మరో 13 మంది

ఏలూరులో వింత వ్యాధి బాధితుల సంఖ్య కొనసాగుతోంది. ఇవాళ మరో 13 మంది ఆస్పత్రిలో చేరారని ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఏలూరు ఘటనపై రేపు నివేదిక

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు బాధితులను ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించిన ఆయన క్రమక్రమంగా బాధితుల సంఖ్య తగ్గుతోందని.. ప్రత్యేకంగా మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం

రాష్ట్రంలో కొత్తగా నిర్మించే నాలుగు ఫిషింగ్ హార్బర్ల టెండర్లను ఎంఆర్​కేఆర్ కనస్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుంది. మొత్తం నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి గానూ రూ.1205.77 కోట్లతో టెండర్లు ఖరారయ్యాయి. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా అంచనాల కంటే రూ.60 కోట్ల మేర ఆదా అయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • పార్లమెంట్ నూతన​ భవనానికి శంకుస్థాపన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దిల్లీలోని నూతన పార్లమెంట్​ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వివిధ మతాల పెద్దలు సర్వ ధర్మ ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

కేంద్రమంత్రులతో పాటు వివిధ దేశాల రాయబారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • కొత్త పార్లమెంటు భవనం భారతీయుల నైతికతకు ప్రతీక

పార్లమెంటు నూతన భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. భారతీయుల నైతికతకు ఈ భవనం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి

బంగాల్​ పర్యటనలో ఉన్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వాహనశ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. టీఎంసీ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భాజపా ఆరోపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • అమెరికాలో కరోనాకు ఒక్కరోజే 3000 మంది బలి

అమెరికాలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఒక్కరోజే 3000 మందినిపైగా బలిగొంది. ఇప్పటివరకు నమోదైన రోజువారీ మరణాల్లో ఇదే అత్యధికం. మరోవైపు జపాన్​ రాజధానిలో తొలిసారిగా 600కుపైగా కొవిడ్ కేసులు​ నమోదుకావడంపై అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • కోహ్లీ అగ్రస్థానంలో.. టాప్​-50లోకి పాండ్య

ఐసీసీ గురువారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో కోహ్లీ, రోహిత్ శర్మ తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య టాప్-50లోకి ఎంట్రీ ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • అమ్మో.. అంత పెద్ద సినిమాలు తీశారా?

మన దేశంలో అత్యంత ఎక్కువ నిడివి గల చిత్రాలేంటి? అవి ఎప్పుడు వచ్చాయి? అందులో ఎవరెవరు నటించారు? లాంటి ఆసక్తికర అంశాలే ఈ కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.