- ఏలూరులో 583కు చేరిన వింత వ్యాధి బాధితుల సంఖ్య
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బాధితుల సంఖ్య 583కి చేరింది. ఇప్పటికే 470 మంది డిశ్చార్జి కాగా..ప్రస్తుతం ఆస్పత్రిలో 93 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో, ఎన్‌సీడీసీ అధికారులు .. ఆస్పత్రిని సందర్శించి నమూనాలు సేకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- మూడు రిజర్వాయర్లకు సీఎం శంకుస్థాపన
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. పేరూరు జలాశయాన్ని వైఎస్‌ఆర్ జలాశయంగా పేరు మారుస్తూ జీవో జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఇదేనా రైతుకు మీరిస్తోన్న మద్దతు
మద్దతు ధరపై ప్రభుత్వం చెప్పే మాటలన్నీ నిజాలైతే రైతులెందుకు రోడ్డెక్కుతున్నారని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. నెల్లూరు జిల్లాలో వరి రైతులు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టమాటా రైతులు ఎందుకు రోడెక్కారో ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- కొవిడ్ తగ్గాలని ఖరగ్పూర్ నుంచి తిరుపతికి పాదయాత్ర
కరోనా మహమ్మారి తగ్గాలని పశ్చిమ బంగాల్ ఖరగ్పూర్ నుంచి తిరుపతికి ఒక వ్యక్తి పాదయాత్ర చేపట్టారు. నవంబర్ 10న ఈ యాత్ర ప్రారంభించగా.. పాదయాత్ర ద్వారా విశాఖ జిల్లా అనకాపల్లికి చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- రూ.165 కోట్ల డ్రగ్స్, ఆయుధాలు పట్టివేత
అసోంలో సుమారు రూ.165 కోట్లు విలువైన నిషేధిత మత్తు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అక్రమ రవాణా ముఠాలకు చెందిన ఆరుగురిని పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- చెట్టినాడ్ కార్యాలయాలపై ఐటీ దాడులు
తమిళనాడుకు చెందిన వ్యాపార సంస్థ చెట్టినాడ్పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీ పలు ప్రాంతాల్లో పన్ను ఎగవేసిందనే ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 15 రోజుల్లోనే 3 సార్లు గృహ నిర్భంధం: ముఫ్తీ
తనను అక్రమంగా గృహనిర్బంధం చేశారని మరోమారు ఆరోపించారు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ. పక్షం రోజుల్లోనే మూడోసారి తనని నిర్బంధించారని ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఇటలీపై వరుణాగ్రహం
భారీ వర్షాలతో ఇటలీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు..ఇటలీలోని పలు నగరాలు వరదల్లో చిక్కుకున్నాయి. రహదారులపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- కోహ్లీ లేకపోయినా టీమ్ఇండియా సిద్ధంగా ఉండాలి'
సవాళ్లను స్వీకరించి ఎదుర్కొనేందుకు టీమ్ఇండియా సిద్ధంగా ఉండాలని దిగ్గజ క్రికెటర్ సచిన్ చెప్పాడు. ఆసీస్తో టెస్టు సిరీస్లో సారథి కోహ్లీ, ఇషాంత్ శర్మ దూరమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. డిసెంబరు 17 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- రియాకు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తి అరెస్టు
సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తికి డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అతడిని కోర్టు ముందు హాజరు పరచనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..