ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - ఏపీ ప్రధాన వార్తలు

..

ప్రధాన వార్తలు @ 7 PM
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : Dec 9, 2020, 6:59 PM IST

  • వణుకుతోన్న ఏలూరు

అంతు చిక్కని వ్యాధితో ఏలూరు సతమతమవుతోంది. తాజాగా మరికొంతమంది ఈ వ్యాధి బారిన పడటంతో... మొత్తం బాధితుల సంఖ్య 585కు చేరింది. అయితే కొత్త కేసుల సంఖ్య క్రమేణా తగ్గుముఖం పడుతోందని అధికారులు వెల్లడించారు. ప్రజల అస్వస్థతకు కారణాలపై వివిధ సంస్థలు పరిశోధిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఏలూరు ఘటనకు కచ్చితమైన కారణాలు కనుక్కోవాలి

ఏలూరు ఘటనపై నిశిత పరిశీలన, అధ్యయనం చేసి కచ్చితమైన కారణాలు కనుక్కోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. తాగునీటి వల్ల అస్వస్థత వచ్చిందా? లేదా? అన్న విషయంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏలూరు ఘటనపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఏలూరు ఘటనపై జనసేన నివేదిక

ఏలూరులో వింత వ్యాధి వల్ల వందల మంది ఆస్పత్రుల పాలయ్యారు. బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. బాధితుల కోసం తగిన వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆరోగ్యశాఖ మంత్రి ప్రాతినిధ్యం ఉన్న ఏలూరులో పిల్లలకు ఐసీయూ లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • రైతు కన్నీరు తుడవండి

ఊరికే గాలిలో తిరిగి గాలి మాటలు చెప్పడం కాకుండా.. రైతు కన్నీరు తుడిచి వెంటనే పరిహారం అందించి.. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రైతుల ఆవేదనకు సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • రైతు నిరసనలు ఉద్ధృతం- 14న దేశవ్యాప్త ఆందోళనలు

నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సవరణలను తిరస్కరిస్తున్నట్లు దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు స్పష్టం చేశాయి. ఈ నెల 14న దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఈ నెల 12 వరకు దిల్లీ-జైపుర్​, దిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • రైతు నిరసనలపై రాష్ట్రపతితో విపక్షాల భేటీ

సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాల్సిందేనని తేల్చిచెప్పాయి విపక్షాలు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి కోవింద్​తో జరిగిన భేటీలోనూ స్పష్టంగా చెప్పినట్టు వివరించాయి. రైతుల సమస్యలను తీర్చడం కేంద్రం బాధ్యతని గుర్తుచేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • జస్టిస్​ కర్ణన్​కు కరోనా

మద్రాస్​ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ కర్ణన్​.. కొవిడ్​ బారిన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • చైనా టీకా 86% సమర్థవంతం

చైనా సంస్థ సినోఫార్మ్ తయారుచేసిన కరోనా టీకా 86 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు యూఏఈ తెలిపింది. టీకా ట్రయల్స్​ మధ్యంతర ఫలితాలను విశ్లేషించినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • తగ్గిన పసిడి ధర- తాజా లెక్క ఇలా..

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.118 పడిపోయి.. రూ. 49,221కి పరిమితమైంది. వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ. 875 పతనమై.. రూ.63,410కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • పార్థివ్​ పటేల్ రిటైర్మెంట్​పై మాజీల స్పందన

ప్రముఖ క్రికెటర్​ పార్థివ్​ పటేల్​.. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో పలువురు మాజీలు ఈ విషయమై స్పందించారు. పార్థివ్​ భవిష్యత్​కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.