ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వచ్చే మార్చి రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మార్చి 12 లేదా 15 తేదీ నుంచి సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ను 16వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. మొత్తం 15 పని దినాలపాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ముందస్తు బడ్జెట్ సమావేశాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు ప్రభుత్వ శాఖలు తమ తమ ప్రతిపాదనల్ని ఆర్థిక శాఖకు సమర్పిస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్ స్వరూపానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖలకూ నిధుల కేటాయింపులపై ఆర్థికమంత్రి బుగ్గన దృష్టిసారించారు.
ఇవీ చదవండి...'విశాఖలో మెట్రోరైల్ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభిస్తాం'