ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) గుర్తింపును ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు.
30 ఏళ్లుగా ఉన్న సంఘాలకు గుర్తింపు ఇవ్వని ప్రభుత్వం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి కేవలం 30 రోజుల్లో గుర్తింపు ఇవ్వడంపై పలు అనుమానాలు ఉన్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల్లో చీలిక తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఉద్యోగులంతా ఐకమత్యంగా ఉంటేనే ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు, ప్రయోజనాలను తెచ్చుకోగలమని అభిప్రాయపడ్డారు. ఒకే ఉద్యోగి... ఒకే సభ్యత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. మరోవైపు పెన్షనర్ల డీఏకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బొప్పరాజు కోరారు.
ఇదీ చదవండి
విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనత ఆజాద్దే: సీఎం జగన్