విజయవాడ పటమటలోని గణపతి సచ్చిదానందస్వామి దత్తపీఠం ఆశ్రమంలో అనఘాష్టమి సందర్భంగా సామూహిక వ్రతాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయశాస్త్రి, ఇతర పండితులు శాస్త్రోక్తంగా ఈ వ్రతాన్ని సువాసినులతో ఈ వ్రతం చేయించారు.
వ్రత విశిష్టత
అనేక రూపాలు ధరించే గురుదత్తాత్రేయునికి ఉండే గృహస్త రూప స్వామికి అనఘస్వామిగా.. ఆ స్వామి అర్ధాంగికి అనఘాదేవిగా పేరు. అనఘాదేవిది సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. అనఘాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మీ, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉంటాయని భక్తుల విశ్వాసం. అనఘస్వామిలో బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలున్నాయని భక్తులు నమ్ముతారు. అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మీ స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వీరి వ్రతాన్ని ఆచరించడం వల్ల వంశవృద్ధి కలిగి, పాపాలు నశించి సంతోషంగా ఉంటారనేది భక్తుల నమ్మకం. ప్రతి ఏటా మార్గశిరమాసం కృష్ణపక్షం అష్టమి రోజున ఈ వ్రతం చేస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి: 'విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి'