Kisan Sammelan in vijayawada: విజయవాడ ఎస్.ఎస్.కన్వెన్షన్‌లో నేటినుంచి మూడురోజుల పాటు జాతీయ కిసాన్ సమ్మేళన్ జరగనుంది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. సేంద్రియ సాగును ప్రోత్సహించడం, సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ సమ్మేళన్ ఏర్పాటు చేశారు.
100కు పైగా ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాల్స్..
ఈ ఆర్గానిక్ మేళాను.. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. ఈ సమ్మేళన్‌లో రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 100కు పైగా ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, బట్టలు, మొక్కలు, మందులతోపాటు.. సేంద్రియ సాగుకోసం వినియోగించే యంత్ర పరికరాలను ఈ మేళాలో ప్రదర్శిస్తున్నారు.
పంటలకు మంచి ధర లభించేలా చూడాలి..
రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ సాగుకు ప్రోత్సాహక సంస్థ ఏర్పాటు చేయాలని.. కంభంపాటి హరిబాబు అన్నారు. రైతుల ఉత్పత్తులకు సంబంధించి సంస్థకు బాధ్యతలివ్వాలని సూచించారు. పంటలకు మంచి ధర లభించేలా చూడడంతో పాటు.. విదేశాలకు ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలన్నారు. పంట ఉత్పత్తులతో తెలుగు రైతులు విదేశీ మారకద్రవ్యం సాధించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:
NTR HEALTH UNIVERSITY : 'ఏజెన్సీల్లో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రావాలి'