అధికారం లేకే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. యాత్రల పేరుతో ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యాలేనన్నారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అంబటి అన్నారు. గతంలో ఇసుక, తర్వాత అమరావతి, ఇప్పుడు పింఛన్ల కోసం చనిపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి యాత్ర ప్రారంభించిన చంద్రబాబు తిరిగి వారం రోజుల తర్వాత చేపడతామనడాన్ని తప్పుబట్టారు. గతంలో జగన్ పాదయాత్రకు ఒకరోజు విరామం ఇస్తే తెదేపా నేతలు ఆరోపణలు చేశారని.. ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు సభ జరుగుతుండగా... అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ దాడుల నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: