చిత్తూరు జిల్లాలో అమర్రాజా ఇన్ఫ్రాటెక్‌కు కేటాయించిన భూమిలో కొంతమేర వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేటాయించిన 483.27 ఎకరాల్లో 253 ఎకరాలను వెనక్కు తీసుకుంటూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్ ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు అమర్ రాజా ఇన్ఫ్రా టెక్ నుంచి భూమిని వాపసు తీసుకునేందుకు ఏపీఐఐసీకి పరిశ్రమల శాఖ ఆదేశాలిచ్చింది.
2010లో చిత్తూరు జిల్లా యడమర్రి మండలం కొత్తపల్లిలో డిజిటల్ వరల్డ్ సిటీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 483.27 ఎకరాల భూమిని అమర్రాజా ఇన్ఫ్రాటెక్‌కు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. పదేళ్లు దాటినా నిబంధనల ప్రకారం... ఉద్యోగాలు కల్పన, సంస్థ విస్తరణ లేకపోవడంతో నిరుపయోగంగా మిగిలి ఉన్న 253 ఎకరాలను ప్రస్తుతం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
ఇవీ చదవండి: మత్తుతో చిత్తవుతున్న విద్యార్థులు...గుట్టుగా గంజాయి విక్రయాలు