Amaravathi Farmers :రాజధాని కేసులో అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా అమరావతిలో నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలని..3నెలల్లోనే అభివృద్ధి చేసిన స్థలాలు రైతులకు ఇవ్వాలని, 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం మరింత సమయం కావాలని, సరిపడా నిధులు లేవని అఫిడవిట్ దాఖలు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే చర్యలు ఇప్పటికైనా మానివేసి.. అమరావతి అభివృద్ధి చేయాలని కోరుతూ..."బిల్డ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్" నినాదానంతో రాజధాని అమరావతి రైతులు చలో దిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా ఉదయం 4 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి దిల్లీ బయలుదేరారు.
ఇదీ చదవండి : Amaravati: కాలయాపన చేసేందుకే ప్రభుత్వం సాకులు