కేంద్ర ప్రభుత్వం మెుండి వైఖరితో విశాఖ ఉక్కుని ప్రైవేటుపరం చేయటానికి ముందుకు వెళ్తోందని తెదేపా సహా కార్మిక సంఘాలు, విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. విశాఖ ఉక్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయం, కార్మికుల భవిష్యత్తుని నాశనం చేసేలా ఉందన్నారు. విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.
పార్లమెంట్ వేదికగా తమ పార్టీ ఎంపీలు విశాఖ ఉక్కు కోసం పోరాడుతారని, వైకాపా ఎంపీలు కూడా మద్దతు ఇవ్వాలని కొల్లు రవీంద్ర కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాదని రాష్ట్ర భాజపా నాయకులు చెబుతూ ప్రజల్ని మోసగించుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. చేతనైతేనే మాట్లాడాలని లేకపోతే ఊరికే ఉండాలని సోమువీర్రాజుకు సూచించారు. కేవలం లేఖలు రాస్తూ ముఖ్యమంత్రి ఉండకూడదని, ప్రత్యక్షంగా తమతో పోరాటానికి రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు కార్యాచరణ ప్రకటించబోతున్నట్లు రామకృష్ణ వెల్లడించారు.
ఇదీ చదవండి:
AP HighCourt: గ్రామ సచివాలయాలపై హైకోర్టు విచారణ.. జీవో 2ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు