రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేవరకు తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదని అమరావతి పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. విజయవాడలో ఐకాస ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెదేపా, భాజపా, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నుంచి నేతలు హాజరయ్యారు. రాజధానిపై మనస్తాపంతో మృతిచెందిన రైతులు, రైతు కూలీలకు నివాళి అర్పించారు. అమరావతి పోరాటం పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండించారు. పలు తీర్మానాలు చేశారు. రాజధాని ప్రకటన అనంతరం మానసిక వేదనతో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని తీర్మానించారు. 13 జిల్లాల్లో ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని, రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా దిల్లీ పర్యటన సాగాలని తీర్మానించారు. అలాగే మహిళలను డ్రోన్‌తో చిత్రీకరణపై విచారణకు డిమాండ్ చేయాలని, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసేలా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని తీర్మానం చేశారు. మహిళలపై పెట్టిన కేసులు, అక్రమ కేసులు ఎత్తి వేయాలని సమావేశంలో తీర్మానించారు.
'అమరావతి సాధించేవరకు పోరాటం ఆపేది లేదు' - అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో సమావేశం
అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐకాస నాయకులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. రాజధానిపై మనస్తాపంతో మృతిచెందిన రైతులు, రైతు కూలీలకు ఐకాస నివాళి అర్పించింది. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.