ఆకాశవాణి విశ్రాంత స్టేషన్ డైరెక్టర్, రేడియో నాటిక అభిమానులకు చిరపరిచితులు ప్రహరాజు పాండురంగారావు (81) గురువారం రాత్రి విజయవాడలో మృతిచెందారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన పాండురంగారావు 1964లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించారు. విజయవాడ కేంద్రానికి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా, కడప, నిజామాబాద్ రేడియో కేంద్రాల్లో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. మార్కాపురం రేడియో స్టేషన్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించారు.
2000లో ఉద్యోగ విరమణ చేసి, విజయవాడలో స్థిరపడ్డారు. రేడియో నాటిక ప్రయోక్తగా పాండురంగారావు పేరు గడించారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన హరహరమహాదేవ, బ్రహ్మ నీరాత తారుమారు తదితర రేడియో నాటికలు ప్రజాదరణ చూరగొన్నాయి. రేడియో కళాకారుల సంఘాన్ని స్థాపించి 500కుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.
ఇదీ చదవండి: