ETV Bharat / city

ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆలపాటి - వైకాపా పై తెదేపా నేత విమర్శలు

వైకాపా ప్రభుత్వంపై మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శలు గుప్పించారు. పాత పథకాల పేరు మారుస్తూ...తెదేపా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

alapati raja
మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
author img

By

Published : Jun 27, 2020, 10:28 AM IST

వైకాపా ప్రభుత్వం పాత పథకాలకే పేర్లు మారుస్తూ తెలుగుదేశంపై దుష్ప్రచారం చేస్తోందని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. రైతులకు ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పంటల బీమా పథకానికి గత తెదేపా హయాంలోనే 2వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేశామని గుర్తుచేశారు.

కొనుగోళ్ల కేంద్రాలు మూసివేసి వారం గడుస్తున్నా.. 40 వేల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.1,240 కోట్లు ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. పంటల కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం 5 వేల కోట్లు వెచ్చించగా.. జగన్ ప్రభుత్వం మాత్రం 1500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు.

రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి వారికి ద్రోహం చేస్తున్నారని ఆలపాటి ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ధాన్యం బకాయిలు చేతికి రాక.. పెట్టుబడి కోసం రైతులు అధిక వడ్డీలు వసూలు చేసే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు.

సున్నా వడ్డీ కింద 4వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి.. 100 కోట్లు బడ్జెట్​లో పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని మండిపడ్డారు. రైతు భరోసా పేరుతో 13 వేల 500 రూపాయలు ఇస్తామని చెప్పి.. రాష్ట్ర నిధుల నుంచి కేవలం 7వేల 500 మాత్రమే మూడు దఫాలుగా చెల్లిస్తూ.. మోసం చేస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనలో ఏడాదిలోనే 600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: అమానవీయం..కరోనా మృతదేహం జేసీబీతో శ్మశానానికి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.