దేశ వ్యాప్తంగా 75 వారాలపాటు 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట నిర్వహిస్తోన్న కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జిల్లా అధికారులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిలో స్వాంత్ర్య స్ఫూర్తి, దేశభక్తి భావనను పెంపొందించేందుకు 'అజాదీ కా అమృత్' మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా వాసి కావడం మరో విశేషమని అన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ అహింస మార్గం ద్వారా శాంతి, సామరస్యం కోసం కృషి చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: