గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిచిపోయింది. 177 మంది ప్రయాణికులతో దిల్లీ బయల్దేరాల్సిన విమానం ఆగిపోయింది. దీంతో విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులను తిరిగి లాంజ్‌లోకి తరలించారు. సమాచారం అందుకున్న సిబ్బంది విమానంలో తలెత్తిన సాంకేతికలోపాన్ని సరిచేస్తున్నారు. ప్రయాణికులను రాత్రి 8 గంటలకు దిల్లీ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీచదవండి.