ETV Bharat / city

AIDED SCHOOLS: తీవ్ర ఒత్తిడితోనే సమ్మతి తెలిపాం..! - vijayawada news

ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ఒత్తిడి చేయబోమని, సమ్మతించని వాటికి గ్రాంటు కొనసాగిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఎయిడెడ్‌ యాజమాన్యాలు గతంలో ఇచ్చిన సమ్మతిని వెనక్కి తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు ఇప్పుడు సిబ్బందిని వెనక్కి ఇవ్వాలని కోరుతూ లేఖలు రాస్తున్నాయి. మరికొన్ని గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాయి. గ్రాంటు కొనసాగింపుపై సుమారు 26 సంస్థలు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అదే సమయంలో పాఠశాలలను కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి.

AIDED SCHOOLS
AIDED SCHOOLS
author img

By

Published : Oct 31, 2021, 5:07 AM IST

తీవ్ర ఒత్తిడితోనే సమ్మతి తెలిపాం..!

ఒత్తిడిలో సమ్మతి ఇచ్చాం.. వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వండంటూ ఎయిడెడ్‌ యాజమాన్యాలు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు లేఖలు రాస్తున్నాయి. ఒత్తిడిలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించామని చెబుతున్నాయి. ఆస్తులతో సహా లేదా సిబ్బందిని వెనక్కి ఇవ్వాలని.. ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ఒత్తిడి చేయబోమని, సమ్మతి తెలపని వాటికి గ్రాంట్‌ కొనసాగిస్తామని.. ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చినందున.. పోస్టులను అప్పగిస్తూ గతంలో ఇచ్చిన సమ్మతిని వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేస్తున్నాయి. ఒత్తిడి కారణంగానే సెప్టెంబరు 6న సిబ్బందిని అప్పగించామని పేర్కొంటూ డియోసెస్‌ ఆఫ్‌ నెల్లూరు సొసైటీ అక్టోబరు 4న పాఠశాల విద్యాశాఖ సంచాలకుడికి లేఖ రాసింది. పోస్టులను అప్పగిస్తూ గతంలో ఇచ్చిన సమ్మతిని వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొంది. ఈ సొసైటీకి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 34 పాఠశాలలు ఉన్నాయి.

కృష్ణా జిల్లాలోని 20 పాఠశాలల ద్వారా వందేళ్లుగా పేదలకు విద్యనందిస్తున్న ది రోమన్‌ క్యాథలిక్‌ డియోసెస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ డెక్కన్‌ సొసైటీ విజయవాడ.. తమ ఎయిడెడ్‌ను కొనసాగించాలని ఈ నెల 5న విద్యాశాఖను కోరింది. తాము నిర్వహించలేక బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించ లేదని.. తీవ్రమైన ఒత్తిడి, భయంతో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అప్పగిస్తూ లేఖ ఇచ్చామని స్పష్టం చేసింది. గుంటూరులో రోమన్‌ క్యాథలిక్‌ మిషన్‌కు 70 వరకు పాఠశాలలు ఉండగా.. గతంలో ఇచ్చిన సమ్మతి లేఖలను వెనక్కి తీసుకుంటామని కోరుతోంది. ఇదే జిల్లాలో మరో 12 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు ఎయిడెడ్‌ కొనసాగించాలని అధికారులను అభ్యర్థిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో సిబ్బందిని అప్పగించేందుకు సమ్మతి లేఖలు సమర్పించిన 9 యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యధికంగా విద్యా సంస్థలు కలిగిన రోమన్‌ క్యాథలిక్‌ మిషన్‌ ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ సంచాలకుడికి లేఖలు రాసింది. ఇవి కాకుండా మరో 15 ఇతర యాజమాన్యాలు లేఖలు రాసేందుకు సిద్ధమయ్యాయి.

ఎయిడెడ్‌ పాఠశాలలకు గ్రాంటు నిలిపివేయడంపై చాలాచోట్ల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఎయిడెడ్‌ పాఠశాలలను కొనసాగించాలనే డిమాండ్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి క్రమంగా పెరుగుతోంది. ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. విశాఖపట్నంతో మొదలైన తల్లిదండ్రుల ఆందోళన తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లోనూ కొనసాగింది.

ఇదీ చదవండి:

వైకాపా దుర్మార్గాలను అడ్డుకునేందుకు.. ప్రజామద్దతు కావాలి : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.