ETV Bharat / city

DURGA TEMPLE: దుర్గమ్మకు నేటి నుంచే ఆషాడసారె సమర్పణ..

author img

By

Published : Jul 10, 2021, 8:52 PM IST

Updated : Jul 11, 2021, 12:13 AM IST

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తులు ఆషాడసారె సమర్పణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. సారె సమర్పణకు రావాలనుకునే భక్తులు ముందుగానే ఆలయ కార్యాలయాన్ని సంప్రదించాలని దేవస్థానం ఛైర్మన్ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. కొవిడ్​ నిబంధనలు తప్పక పాటించాలని ఆయన సూచించారు.

DURGA TEMPLE
దుర్గమ్మకు ఆషాడసారె సమర్పణ కార్యక్రమం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి ఆషాడమాసం సందర్భంగా అమ్మవారికి ఆషాడసారె కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక, అర్చక సిబ్బంది అమ్మవారికి మొదటి సారె సమర్పించడంతో ఆషాడ పవిత్ర సారె కార్యక్రమం ప్రారంభమవుతుంది.

ముందుగా సంప్రదించిన వారికే అనుమతి..

భక్తులు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ అమ్మవారికి ఆషాడ సారె సమర్పించవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఆషాడ సారె సమర్పణకు రానున్న భక్తులు ముందుగా ఆలయ కార్యాలయం ఫోన్‌ నెంబర్లు 9493545253, 8341547300 లను మూడు రోజులు ముందుగా సంప్రదించి వివరాలు తెలియజేయాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి సమయం నిర్దేశిస్తామని.. దానికి అనుగుణంగానే భక్తులు సారెతో ఆలయానికి చేరుకోవాలని సూచించారు. ఆషాఢ మాసంలో అమ్మవారి దర్శనానికి, సారె సమర్పణకు వచ్చే భక్తులు విధిగా కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ పైలా సోమినాయుడు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

BUDDHA PRASAD: 'మాతృభాషను గౌరవించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం'

Last Updated : Jul 11, 2021, 12:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.