సినీ నిర్మాత బీఏ రాజు మృతిపై నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజుతో తనకు ఎప్పటినుంచో మంచి అనుభందం ఉందని గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఆయన మన మధ్య లేరనే వార్త తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు. రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవీ చదవండి: