ETV Bharat / city

మెట్రోరైల్ ప్రధాన కార్యాలయం... కాదు.. కాదంటూనే తరలింపు! - updates on metro in ap

కాదు..కదంటూనే మెట్రోరైల్ ప్రధాన కార్యాలయ తరలింపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయవాడలోని మెట్రో రాష్ట్ర కార్యాలయాన్ని వేరే భవనానికి మార్చారు. ఆ కార్యాలయం అద్దె రూ.15వేలు. అదే విశాఖలో ప్రాంతీయ ఆఫీసు అని చెబుతున్న భవనానికి మాత్రం రూ.2.5లక్షలు అద్దె కడుతున్నారు. ఏది ప్రధాన కార్యాలయం అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మెట్రో ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి మాత్రం ప్రధాన కార్యాలయం విజయవాడలోనే ఉంటుందని అంటున్నారు.

where is metro building in ap
ఏపీ మెట్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ
author img

By

Published : Sep 25, 2020, 6:59 AM IST

విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయాన్ని మరో ప్రాంతానికి మార్చారు. సామగ్రిని తరలిస్తున్నారు. ఈ మేరకు నోటీసులో పేర్కొన్నారు. అద్దెభారం ఎక్కువగా ఉండటంతో మరో ప్రాంతానికి మార్చుతున్నట్లు ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి చెప్పారు. మరోవైపు విశాఖలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే.. అదే ప్రధాన కార్యాలయం కానుందని తెలుస్తోంది.

అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) పేరుతో 2014లో విజయవాడలో ఏర్పాటు చేశారు. లబ్బీపేటలోని గుమ్మడిగోపాలరావు వీధిలో ఇది ఉంది. ఒకే భవనంలో ఏఎంఆర్‌సీ కార్యాలయం, దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ) కార్యాలయం ఏర్పాటు చేశారు. దీనికి అద్దె నెలకు రూ.1.75లక్షలు చెల్లించేవారు. విజయవాడ నగరంలో 26 కిలోమీటర్లు మెట్రో నిర్మాణం చేయాల్సి ఉంది. తదనంతరం జరిగిన పరిణామాల్లో డీఎంఆర్‌సీ ఉద్యోగులు ఇక్కడి నుంచి ఖాళీచేసి దిల్లీకి వెళ్లిపోయారు. అయినా ఏఎంఆర్‌సీ అద్దె చెల్లిస్తూ వస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత విజయవాడ మెట్రో పక్కన పెట్టేశారు. విశాఖ మెట్రో కారిడార్‌పై దృష్టి సారించారు. అక్కడ 80 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం చేయనున్నారు. దీనికి టెండర్లు పిలిచారు. అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ను ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌గా పేరు మార్చారు. ఎండీగా ఎన్‌పీ రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన ఎక్కువగా విశాఖలోనే ఉంటున్నారు.

అద్దె భారం ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర కార్యాలయాన్ని లబ్బీపేటలోనే బృందావన్‌ కాలనీకి మార్చారు. అక్కడ ఒక ఫ్లాట్‌ను తీసుకుని వీఎంసీ ఆధ్వర్యంలో నెలకు రూ.15వేలు అద్దె చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్టోబరు 1 నుంచి అక్కడికి తరలిస్తున్నట్లు ఎండీ వెల్లడించారు.

విశాఖలో ప్రాంతీయ కార్యాలయం అంటూ..
మరోవైపు విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం ఎల్‌ఐసీ కాలనీలో ఓ భవనం అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. దీని అద్దె నెలకు రూ.2.5 లక్షలుగా నిర్ణయించి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. గత మూడు నెలలుగా విశాఖలో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు దీన్ని ప్రాంతీయ కార్యాలయంగా చెబుతున్నా ఇదే ప్రధాన కార్యాలయం కానుంది. సిబ్బందిని కూడా విశాఖకు తరలించనున్నారని తెలిసింది. న్యాయస్థానాల ఆదేశాలు ఉండటంతో.. కార్యాలయం తరలించడం లేదని చెబుతున్నారు. పేరుకు విజయవాడలో నామమాత్రపు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. రూ.15వేల అద్దెతో ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఇదే అంటున్నారు. విశాఖ కార్యాలయం మాత్రం ప్రాంతీయ కార్యాలయంగా చెబుతున్నారు. దాని అద్దె మాత్రం నెలకు రూ.2.5లక్షలు. అద్దెలో వ్యత్యాసమే ఏది ప్రధాన కార్యాలయం..ఏది ప్రాంతీయ కార్యాలయం అన్నది వెల్లడిస్తోంది. కార్యాలయం తరలింపు లేదని మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. కార్యాలయం విజయవాడలోనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: జీవోలో 'ముస్లిం యూత్​' అని ఎలా ప్రస్తావిస్తారు?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.