ETV Bharat / city

ACHARYA TEAM: దుర్గమ్మను దర్శించుకున్న "ఆచార్య" చిత్ర బృందం.. ​ - విజయవాడలో ఆచార్య చిత్ర బృందం

ACHARYA TEAM: ఆచార్య సినిమా విడుదలను పురస్కరించుకుని సినీనటుడు రామ్‌చరణ్‌, దర్శకుడు కొరటాల శివ తదితరులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో భ్రమరాంబ, ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో చిత్ర బృందానికి స్వాగతం పలికారు. అమ్మవారికి రామ్‌చరణ్‌ పసుపు, కుంకుమ, చీర మొదలైనవి సమర్పించారు. చరణ్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో వారిని నియంత్రించడం భద్రతా సిబ్బందికి కష్టతరమైంది. అభిమానులు పోలీసులు, ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని పక్కకు తోసేసి మరీ ఆలయం లోపలికి దూసుకెళ్లారు.

ACHARYA TEAM
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న "ఆచార్య" చిత్ర బృందం
author img

By

Published : Apr 27, 2022, 3:09 PM IST

Updated : Jul 21, 2022, 12:42 PM IST

ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న "ఆచార్య" చిత్ర బృందం

ACHARYA TEAM: మెగాస్టార్ చిరంజీవి, రామ్​చర్​ణ్ కథానాయకులుగా నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ​సినిమా విడుదలను పురస్కరించుకొని హీరో రామ్​చరణ్​, దర్శకుడు కొరటాల శివ తదితరులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో భ్రమరాంబ, ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో చిత్ర బృందానికి స్వాగతం పలికారు. అమ్మవారికి రామ్‌చరణ్‌ పసుపు, కుంకుమ, చీర మొదలైనవి సమర్పించారు.

తరలివచ్చిన అభిమానులు.. : ఉదయం పదకొండు గంటల తర్వాత చిత్ర బృందం ఆలయానికి చేరుకుంది. అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులు ఆలయ ప్రాంగణంలో జై చరణ్‌ అంటూ పెద్ద ఎత్తున తమ అభిమానాన్ని చాటుకున్నారు. అమ్మవారి సన్నిధిలో దుర్గమ్మ నామస్మరణ తప్ప వేరే ఏమీ చేయకూడదని ఆలయ సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా ఎవరూ వినిపించుకోలేదు. చరణ్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో వారిని నియంత్రించడం భద్రతా సిబ్బందికి కష్టతరమైంది. పోలీసులు, ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని పక్కకు తోసేసి మరీ ఆలయం లోపలికి దూసుకెళ్లారు. పోలీసులు, ఆలయ సిబ్బంది, బౌన్సర్ల భద్రతతో అతి కష్టం మీద రామ్‌చరణ్‌, కొరటాల శివ ఆలయంలోకి ప్రవేశించారు.

అంతరాలయంలో చరణ్‌ దర్శనం చేసుకుంటున్న సమయంలో అభిమానులు ఆలయంలో నుంచి సెల్‌ఫోన్లతో దృశ్యాలు చిత్రీకరించడంతో పోలీసులు ఒక దశలో ఆలయ తలుపులు మూసేసే ప్రయత్నం చేశారు. అమ్మవారి మూల విరాట్​ను ఎవరూ ఫొటోలు, వీడియోలు తీయరాదంటూ ఈవో జోక్యం చేసుకుని భద్రతా సిబ్బంది సహాయంతో సెల్‌ఫోన్లలో చిత్రీకరణను నిలిపివేయించారు. కొన్ని ఫోన్లలో చిత్రీకరించిన దృశ్యాలను తొలగింపజేశారు.

ఆశీర్వచన మండపానికి చేరుకోలేక పోయిన చిత్రబృందం..

అమ్మవారి దర్శనానికి ప్రముఖులు ఎవరొచ్చినా వారికి వేదపండితులు ఆశీర్వచనం ఇవ్వడం ఆనవాయితీ.. అయితే అభిమానుల తాకిడి అధికంగా ఉండటంతో చిత్రబృందం మండపం వద్దకు రాలేదు. అంతరాలయం లోపలే అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. అభిమానుల రద్దీకి రెయిలింగ్‌ కొంత పక్కకు జరిగింది.

ఇదీ చదవండి: Students Fights: రోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు.. ఎందుకంటే..!

Last Updated : Jul 21, 2022, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.