దిల్లిలో జరిగిన నిర్భయ ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా మహిళల రక్షణకు ఉద్దేశించిన ప్రాజెక్టు అభయ్.. రాష్ట్రంలోనూ మొదలు కానుంది. ఈ నెల 23న సీఎం జగన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా విశాఖలోని వెయ్యి ఆటోల్లో ట్రాకింగ్ పరికరాలు బిగించనున్నారు. మహిళల రక్షణ కోసం ప్రాజెక్టు అభయ్ పేరుతో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రంలో అభయం పేరుతో ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ చేపట్టారు. ప్రాజెక్టులో భాగంగా... రూ.135 కోట్లతో లక్ష ఆటోల్లో ట్రాకింగ్ పరికరాలు అమర్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 60 శాతం మేర నిధులను కేంద్రం భరించనుంది. ఇప్పటికే పరికరాలు కోసం రూ58.64 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఆటోల్లో బిగించిన ట్రాకింగ్ పరికరాల వివరాలు స్థానిక పోలీసు స్టేషన్లో నమోదయ్యేలా సాంకేతికతను సిద్ధం చేశారు. ఈ పరికరాలు బిగింపు అనంతరం మహిళల రక్షణ పరంగా సురక్షితమైన వాతావరణం ఏర్పదుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చదవండి: