ETV Bharat / city

మన చదరంగం జగజ్జేత.. ఘనమైన ఈ చరిత్ర తెలుసా? - చదరంగం పుట్టుపూర్వోత్తరాలు

కళ్లముందు కనిపించేది నలుపు తెలుపు గళ్లే. కానీ ఒకసారి పావుల్ని కదపడం మొదలు పెడితే ఆటగాడు తనని తాను మర్చిపోతాడు. రాజ్యాలు లేని రాజులూ రాణులూ వారి సైన్యాలూ..! అదో రణరంగం. మొదటి ఎత్తు నుంచి ఆఖరి ఎత్తు వరకు హోరాహోరీగా సాగే పోరాటం. మెదడుకు పనిచెబుతూ... వ్యూహాలకు పదును పెడుతూ... 64 గళ్లలో అనంతమైన యుద్ధ తంత్రాల్ని ఆవిష్కరించే అద్భుతమైన ఆట చెస్‌! అరబిక్‌లోని ‘షా మట్‌’ నుంచి వచ్చిన పదమే ‘చెక్‌మేట్‌ మరి దీనికి అర్థం ఏంటంటే ‘రాజు చనిపోయాడు’అని చెప్పడం. జులై 20 ప్రపంచ చదరంగ దినోత్సవం సందర్భంగా ఒకసారి చెస్​ అంటే ఏంటీ అసలెప్పుడు మొదలైయ్యింది దాని హిస్టరీ ఓ లుక్కేద్దామా.. అయితే రండి..

మన చదరంగం జగజ్జేత.. ఘనమైన ఈ చరిత్ర తెలుసా?

author img

By

Published : Jul 19, 2020, 4:56 PM IST

మనదేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా 196 దేశాల్లో ఆదరణ పొందిన చెస్‌ ప్రయాణంలో మలుపులూ విశేషాలు బోలెడు..

పురాణంలో మండోదరి కోసం..!

రావణుడు తన భార్య మండోదరికి యుద్ధం గురించి చెప్పడానికి ఈ ఆటను కనిపెట్టి నేర్పించాడనీ, ఎంతో తెలివైన మండోదరి తరచూ ఆ ఆటలో భర్తను ఓడించేదనీ చిన్నప్పుడు అమ్మమ్మ ఓ కథ చెప్పేదని విశ్వనాథన్‌ ఆనంద్‌ ఓసారి చెప్పాడు. ఆ కాలంలో మహిళలకు యుద్ధ ప్రవేశం నిషిద్ధం కాబట్టి వారు యుద్ధ అనుభూతిని పొందేందుకు రూపొందించిన ఆట కావచ్చు ఇది! దీని ప్రస్తావన కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనూ వస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి వర్చువల్‌ వార్‌ గేమ్‌ ఇదేనన్నమాట. చరిత్ర ప్రకారమైతే గుప్తుల కాలంలో ఉత్తర భారతంలో చదరంగం మూలాలు ఉన్నాయి. రాజుల కాలంలో గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, మనుషులతో చదరంగం ఆడేవారట! ఆరో శతాబ్దంలో చెస్‌ను ‘చతురంగ’ (సంస్కృతం) అనేవారు. కాలక్రమేణా అది చదరంగంగా మారింది. ఏడో శతాబ్దంలో భారత్‌ నుంచి పర్షియాకు వ్యాపించింది. క్రమంగా ఇతర దేశాలకూ విస్తరించి ఆదరణ పొందింది. ఇప్పుడు ఆడుతున్న చెస్‌, దాని నిబంధనలు 15వ శతాబ్దంలో దక్షిణ యూరోప్‌లో రూపుదిద్దుకున్నాయి.

ఆధునిక చదరంగం

పదిహేనో శతాబ్దం తర్వాత కొన్నేళ్లపాటు ‘రొమాంటిక్‌ చెస్‌’ ప్రజల్లోకి వెళ్లింది. త్వరగా సరదాగా ముగిసే ఆటని ఇష్టపడేవారనడానికి భార్యాభర్తలు చదరంగం ఆడుతున్న చారిత్రక చిత్రాలే నిదర్శనం.

మొదటగా ఆడింది అప్పుడే

1886లో మొట్టమొదటి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ జరిగింది. విల్‌హెల్మ్‌ స్టైనిట్జ్‌ (ఆస్ట్రియా) తొలి ప్రపంచ ఛాంపియన్‌. 1924లో పారిస్‌లో తొలి ఒలింపియాడ్‌ జరిగినప్పుడే ప్రపంచ చెస్‌ సమాఖ్య (ఫిడె) ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్లకి మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ జరిగింది. 1948 నుంచి ఓ పాతికేళ్లపాటు చెస్‌లో రష్యాకు ఎదురేలేదు. ఆ దేశ ఆటగాళ్లు బోత్నివిక్‌, వాసిలీ సిస్లోవ్‌, మైఖెల్‌ తాల్‌, టైగ్రాన్‌ పెట్రోసియన్‌, బోరిస్‌ స్పాస్కీలు ప్రపంచ చెస్‌ను శాసించారు.

చూడకుండా ఆడవచ్చు!

ఫ్రెంచ్‌ ఆటగాడు ఫిలిడోర్‌కి రాత్రిళ్లు నిద్ర పట్టేదికాదు. దాంతో పడుకునే కళ్లు మూసుకుని చెస్‌ బోర్డును తలచుకుని ఊహల్లోనే ఆట ఆడేసేవాడట. ఆ అలవాటు అతడిని బోర్డు చూడకుండా ఒకేసారి ముగ్గురు ప్రత్యర్థులతో చెస్‌ ఆడి గెలిచేలా చేసింది. 1783లో అతడీ సామర్థ్యాన్ని ప్రదర్శించగా మర్నాడు పత్రికలన్నీ పతాకశీర్షికలతో ప్రశంసించాయి. సాధారణంగా చెస్‌ ఆడేవాళ్లు గళ్లలో ఉన్న పావుల్నీ వాటి కదలికల్నీ ఎన్నో కోణాల్లో ఊహించుకుని, తన ఎత్తుకి ప్రత్యర్థి స్పందన ఎన్ని రకాలుగా ఉండవచ్చో ఆలోచించుకుంటూ బోర్డునే చూస్తుంటారు. అలాంటిది కళ్లకు గంతలు కట్టుకుని పావుల స్థానాల గురించి చెప్పే నొటేషన్‌ విని ఆట ఆడేస్తారు ఈ బ్లైండ్‌ఫోల్డ్‌ చెస్‌ నిపుణులు. ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడు ఆ విషయం మరో క్రీడాకారుడికి తెలియకుండా ఉండటం కోసం మొదలైన ఈ విధానం క్రమంగా ఒక ప్రత్యేక సామర్థ్యంగా మారింది. ఒకరితో కాదు, ఒకేసారి పాతిక, ముప్పై మందితో బ్లైండ్‌ఫోల్డ్‌ చెస్‌ ఆడగల క్రీడాకారులూ ఉన్నారిప్పుడు. హెచ్‌జెఆర్‌ ముర్రే రాసిన ‘ఎ హిస్టరీ ఆఫ్‌ చెస్‌’ పుస్తకంలో మరో రకం చెస్‌ గురించీ ఉంది. గుర్రం మీద పక్కపక్కనే స్వారీ చేస్తూన్న ఇద్దరు సైనికులు అసలు బోర్డూ పావులూ లేకుండానే నోటితో ఎత్తులను చెప్పుకుంటూ చెస్‌ ఆడేవారట. అయితే బ్లైండ్‌ ఫోల్డ్‌ చెస్‌ ప్రాచుర్యం పొందినట్టుగా ఈ ‘నోటిమాటతో ఆట’ ప్రజల్లోకి చేరలేదు. క్రామ్నిక్‌, ఆనంద్‌, షిరోవ్‌ లాంటి వాళ్లంతా బ్లైండ్‌ఫోల్డ్‌లోనూ రాణించారు.

20వ శతాబ్దపు మ్యాచ్‌

దాదాపు పాతికేళ్లపాటు చదరంగంలో రారాజుల్లా వెలిగిపోయారు రష్యా ఆటగాళ్లు. వాళ్లకి నాటకీయంగా చెక్‌ పెట్టాడు అమెరికా వాసి బాబీ ఫిషర్‌. 20వ శతాబ్దంలోనే గొప్ప మ్యాచ్‌గా అభివర్ణించే 1972 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోరు ఐస్‌లాండ్‌ రాజధానికి 26కి.మీ. దూరంలో ఉన్న ఓ ప్రాంతంలో జరిగింది. వరసగా రెండు రోజులూ అక్కడికి ఆలస్యంగా చేరుకుని రెండు పాయింట్లు కోల్పోయిన ఫిషర్‌ మూడో రౌండ్లో బోరిస్‌ను చిత్తుగా ఓడించాడు. అతడి ఆటకు ఫిదా అయిన బోరిస్‌ సైతం చప్పట్లు కొట్టి అభినందించాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాయేతరుడు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం అదే ప్రథమం.

చదరంగం ఇద్దరు మాత్రమే ఆడే ఆట కావటంతో ఛాంపియన్లుగా నిలిచే వ్యక్తులు యావత్‌ ప్రపంచ దృష్టినీ ఆకర్షిస్తారు. కాస్పరోవ్‌, కార్పొవ్‌లతో మొదలైన ఆ ప్రత్యేకత ఇప్పటికీ సాగుతోంది. క్లాసికల్‌ చెస్‌లో తిరుగులేని క్రీడాకారుడిగా, శతాబ్దపు అత్యుత్తమ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్న కాస్పరోవ్‌ తమ దేశానికే చెందిన కార్పొవ్‌ని ఎన్నోసార్లు ఓడించాడు. ఫిడెతో విభేదించి, ఇంగ్లాండ్‌కి చెందిన నిగెల్‌ షార్ట్‌తో కలిసి ప్రొఫెషనల్‌ చెస్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశాడు కాస్పరోవ్‌. దాంతో ఏటా ఇద్దరేసి ప్రపంచ ఛాంపియన్లు వచ్చేవారు. పదిహేనేళ్ల క్రితం మళ్లీ రెండు సంఘాలూ ఒక్కడవటంతో జగజ్జేతగా ఒక్కరి పేరే మార్మోగుతోంది.

యంత్రంతో పోటీ

మనిషిలోని సహజ మేధస్సుకూ యంత్రాల కృత్రిమ మేధకూ మధ్య పోటీకి చదరంగం గొప్ప వేదికైంది. సూపర్‌ కంప్యూటర్లు, ఆటగాళ్ల మధ్య ఎన్నో ఆసక్తికర గేమ్‌లు జరిగాయి. ఎనభయ్యవ దశకంలో మొదలైన ఈ విధానంలో అత్యుత్తమ చెస్‌ ఆటగాళ్లను సైతం కంప్యూటర్లు ఓడించాయి. 1997లో డీప్‌ బ్లూ అనే సూపర్‌ కంప్యూటర్‌ అప్పటి ఛాంపియన్‌ కాస్పరోవ్‌నే ఓడించింది. ఆపై కంప్యూటర్లతో పోరాటాలను డ్రా చేసుకునే స్థాయికి ఆటగాళ్లు ఎదిగారు. 2002లో డీప్‌ ఫ్రిట్జ్‌ అనే యంత్రంతో పోరాడిన క్రామ్నిక్‌ ఆ గేమ్‌ను డ్రాగా ముగించాడు. ఆ తర్వాత మనిషి, యంత్రం మధ్య ప్రపంచ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ కూడా నిర్వహించారు. రెండు టోర్నీలుగా సాగిన ఆ పోటీల్లో కంప్యూటర్లే విజేతలయ్యాయి. 2004లో కర్జకిన్‌ తొలిసారి కంప్యూటర్‌పై గెలిచాడు. అంతరిక్షానికి, భూమికి మధ్యా చెస్‌ పోటీలు జరిగాయి. 1970 జూన్‌ 9న తొలిసారి ఈ తరహా గేమ్‌ జరిగింది. రష్యా వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు భూమిపై ఉన్న ఆటగాళ్లతో తలపడ్డారు. ఆ మ్యాచ్‌ జరిగి 50 ఏళ్లయిన సందర్భంగా ఈమధ్య మరోసారి అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉన్న వ్యోమగాములు భూమిపై ఉన్న ఆటగాళ్లతో పోటీపడ్డారు. ప్రస్తుతం పలు దేశాల్లో ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలను నిర్వహిస్తున్నారు.

మేధస్సును పెంచుతుంది

గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఒక దశలో మేధావులు చెస్‌ ఆడతారా లేక చెస్‌ ఆడితే మేధావులవుతారా అన్న చర్చ కూడా జరిగింది. చదరంగం మేధస్సును పెంచుతుందని పరిశోధనలూ రుజువు చేశాయి. అందుకే చాలా దేశాల్లో పాఠశాలల్లో చెస్‌ నేర్పిస్తారు. వెనిజువెలాలో పిల్లలకు చెస్‌ నేర్పించి చేసిన అధ్యయనంలో వారి ఐక్యూ పెరిగినట్లు గమనించారు. చదరంగం గురించి వివిధ పరిశోధనల్లో తేలిన మరికొన్ని లాభాలేమిటంటే... వృద్ధాప్యంలో ఆల్జీమర్స్‌, డిమెన్షియాలాంటి మతిమరపు వ్యాధుల్ని నివారించవచ్చు. మెదడులోని రెండు భాగాలకూ పని చెప్పే చెస్‌ వల్ల సొంతంగా ఆలోచించే శక్తీ సృజనాత్మకతా పెరుగుతాయి. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. పిల్లల్లో పఠనాసక్తినీ ఏకాగ్రతనీ పెంపొందిస్తుంది. సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యం వస్తుంది. పథకం ప్రకారం పని చేయడమూ దూరదృష్టీ అలవడతాయి.

ఊరినే మార్చింది

కేరళలోని మరొట్టిచల్‌ అనే ఊళ్లో ఏ వీధిలో చూసినా అరుగుల మీద చెస్‌ ఆడుతూ కన్పిస్తారు. అక్కడ ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరికైనా చెస్‌ వచ్చు. ఒక గ్రామం ఇంతలా చదరంగ ప్రియులుగా మారడానికి కారణం చెడు వ్యసనాల నుంచి బయట పడాలనే సంకల్పమే. ఆ ఊరికే చెందిన ఉన్నికృష్ణన్‌ పట్నంలో చెస్‌ నేర్చుకున్నాడు. ఆ ఆట నేర్పి ఊరివాళ్లను వ్యసనాలకు దూరం చేయొచ్చనుకున్నాడు. ఊరికి మకాం మార్చాడు. అక్కడో టీకొట్టు పెట్టుకుని వచ్చిన వాళ్లకు చెస్‌ నేర్పించేవాడు. అతని ప్రయత్నం ఫలించింది. చెస్‌ అంటే ఇష్టం ఒకరి నుంచి ఒకరికి ఊరంతా పాకిపోయింది. తాగుడు, జూదం మర్చిపోయి చదరంగం బల్లకు కళ్లప్పగించడం మొదలెట్టారు. అలా చెస్‌ మొత్తంగా ఆ ఊరినే మార్చేసింది.

అసామాన్యుడు

ఏడేళ్ల క్రితం చెన్నైలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) ఆనంద్‌పై గెలిచి ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాడు. అప్పటినుంచి ఇప్పటివరకూ కార్ల్‌సన్‌కు ఎదురేలేదు. ఆధునిక చెస్‌లో కార్ల్‌సన్‌ ఒక విప్లవం. ఓపెనింగ్‌, మిడిల్‌, ఎండ్‌ గేమ్‌లను సమాన స్థాయిలో ఆడగల సమర్థుడు. ఎన్ని గంటలైనా అలసిపోడు. ప్రత్యర్థి డ్రా చేసుకుందామన్నా ఒప్పుకోడు. చివరివరకు ఆడతాడు. గెలుపే లక్ష్యంగా ఆఖరి క్షణం వరకూ పోరాడతాడు. చెస్‌ చరిత్రలోనే అత్యధిక ఎలో రేటింగ్‌ (2882) సాధించిన ఒకేఒక్కడు!

అయిదుసార్లు... మన ‘ఆనంద్‌’

చెస్‌లో రష్యా గోడను బద్దలుకొట్టిన ఘనత ముమ్మాటికీ మన విశ్వనాథన్‌ ఆనంద్‌దే. ర్యాపిడ్‌, బ్లిట్జ్‌లో వేగంగా ఆడుతూ ‘లైటెనింగ్‌ కిడ్‌’గా రంగంలోకి దిగిన ఆనంద్‌ 1988లో గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగి క్రమంగా ప్రపంచ చెస్‌పై తనదైన ముద్ర వేశాడు. 1995... న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ 107వ అంతస్తులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ జరుగుతోంది. అప్పటికే జగజ్జేత అయిన కాస్పరోవ్‌ను వరుసగా 8 గేమ్‌ల్లో డ్రాలతో నిలువరించాడు ఆనంద్‌. తొమ్మిదో గేమ్‌లో ఆనంద్‌ నెగ్గడం కాస్పరోవ్‌ జీర్ణించుకోలేక పోయాడు. తర్వాతి గేముల్లో ఎలాగో పుంజుకుని విజయం సాధించాడు. ఆ తర్వాత ఐదేళ్లకి అలెక్సీ షిరోవ్‌పై నెగ్గి ఆనంద్‌ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాడు. ఆసియా తరఫున మొదటి ప్రపంచ ఛాంపియన్‌ తనే. ఇరవై ఒక్క నెలల పాటు ఆనంద్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగాడు. 2007లో క్రామ్నిక్‌పై గెలిచి మరోసారి ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాడు. 2008లో క్రామ్నిక్‌, 2010లో తొపలోవ్‌, 2012లో బోరిస్‌ గెల్ఫాండ్‌లను ఓడించిన ఆనంద్‌ మొత్తం అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ కిరీటం అందుకున్నాడు.

తెలుగు తేజాలు

తెలుగు నేలపై దీక్షితులు, రెంటాల సుబ్రహ్మణ్యం, దర్బా వెంకయ్య, బీవీ రంగారావు, కె.శ్రీనివాసరావు, నరసింహమూర్తి, బాపిరాజు తొలి తరం చెస్‌ క్రీడాకారులు. 1959-1966 మధ్య డాక్టర్‌ బెజవాడ గోపాల్‌రెడ్డి అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌)కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. స్వాతంత్య్ర పోరాటంలో జైలుకెళ్లిన ఆయన అక్కడ కూడా చెస్‌ ఆడారని చెబుతారు. హైదరాబాద్‌లో నసీరుద్దీన్‌ గాలిబ్‌ ఏఐసీఎఫ్‌కు కార్యదర్శిగా ఉండేవారు. అప్పట్లో నారాయణగూడలోని వైఎంసీఏ భారత చెస్‌కు కేంద్రం. విశ్వనాథన్‌ ఆనంద్‌ తన తల్లితో కలిసి అక్కడికి వచ్చేవాడు. గాలిబ్‌ దగ్గర సలహాలు, సూచనలు తీసుకునేవాడు. పీడీఎస్‌ గిరినాథ్‌, లంక రవి కూడా చెస్‌లో తెలుగు గడ్డకు పేరు తెచ్చారు. అనంతరం హరికృష్ణ, హంపిల శకం మొదలైంది. 15 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగి హరికృష్ణ రికార్డు సృష్టించాడు. 2001లో ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌గా హంపి అవతరించింది. 2002లో గ్రాండ్‌మాస్టర్‌గా మారిన హంపి మహిళల్లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం హంపి ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌ కూడా. ప్రపంచ అండర్‌-14, అండర్‌-18 కేటగిరుల్లో స్వర్ణాలు సాధించి 2008లో ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌ టైటిల్‌ దక్కించుకుంది ద్రోణవల్లి హారిక.

ప్రపంచంలో ఎక్కువగా ఆడే ఆట ఇప్పటికీ చదరంగమే. ఆ మధ్య ఫిడె చేయించిన ఒక అధ్యయనంలో అరవై కోట్ల మంది చదరంగం ఆడతారని తేలింది. కనీసం ఏడాదికోసారైనా చెస్‌ ఆడేవాళ్లు జర్మనీలో నూటికి 23 మంది ఉంటే, రష్యాలో 43, భారత్‌లో 70 మందీ ఉన్నారట. ఎంతైనా మన ఆట కదా మరి!

ఇదీ చదవండి: 'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.