ETV Bharat / city

నాన్నా.. నిన్ను కాపాడుకోలేకపోయానే..!

Father dead: కళ్ల ముందే తండ్రి నీటిలో మునిగిపోతున్నా.. ఆ కుమారుడు ఏమీ చేయలేకపోయాడు. నిస్సహాయ స్థితిలో సహాయం కోసం చుట్టుపక్కల వారిని పిలిచాడు. వారొచ్చి తండ్రిని బయటకు తీసేలోపే ఆయన మృతి చెందడంతో ఘొల్లుమన్నాడు. ఈ విషాద ఘటన వరంగల్​ జిల్లాలో చోటు చేసుకుంది.

author img

By

Published : Jul 28, 2022, 7:33 PM IST

father dead
father dead

Father died in front of son's eyes: అప్పటి వరకు కుమారుడితో కలిసి పొలం దున్నిన రైతు ఎడ్లను కడుగుదామని కుంటలోకి దిగి ప్రాణాలను పోగొట్టుకున్న విషాద ఘటన ఇది. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం నాగారంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. సత్తయ్య(54) తన కుమారుడు రమేశ్​తో కలిసి పొలం దున్నారు. అనంతరం తండ్రి ఎడ్లను కడగటానికి పక్కనే ఉన్న కుంటలోకి వెళ్లారు. ఎడ్లు కుంటలోకి వెళ్తుండగా వాటిని కాపాడే ప్రయత్నంలో సత్తయ్య కూడా కుంటలోకి దిగగా.. ప్రమాదవశాత్తు జారిపడి ఈత రాకపోవడంతో మునిగిపోయారు.

తండ్రి సత్తయ్య తలను చేతిలోకి తీసుకుని రోదిస్తున్న రమేశ్..

ఎంతకూ రాకపోవడంతో కుంట దగ్గరకు వెళ్లిన రమేశ్​ తండ్రి ముగినిపోవడాన్ని గమనించాడు. తనకూ ఈత రాకపోవడంతో చుట్టుపక్కల రైతులను పిలిచినా వారొచ్చే లోగానే సత్తయ్య మృతి చెందారు. కళ్ల ముందే తండ్రి చనిపోవడంతో రమేశ్ రోదనలు మిన్నంటాయి. నాన్నా.. నిన్ను కాపాడుకోలేకపోయానే..! అంటూ రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. రెండు రోజుల కిందట వారి పశువు విద్యుదాఘాతంతో చనిపోగా.. ఆ ఘటన మరవక ముందే ఇంటి యజమాని మృతి చెందటంతో విషాదం నెలకొంది. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.