భాజపా రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షుల సమావేశం విజయవాడలో జరిగింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దిశానిర్దేశం చేశారు. భాజపా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఏపీలో పనిచేస్తోందన్నారు.
అధికారంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. సురక్ష ఏపీ పేరుతో దేశంలోనే ఆదర్శంగా ఉండేలా తయారుచేస్తామని సోము స్పష్టం చేశారు. నిర్విరామ కార్యక్రమాలు, పోరాటాలతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: