ETV Bharat / city

రక్తం కారుతుంటే.. జనాన్ని పరుగులెత్తించాడు'

author img

By

Published : Aug 22, 2021, 3:55 PM IST

మద్యం మత్తులో ఓ వ్యక్తి.. అక్కడున్న వారందరినీ హడలెత్తించాడు. తాగిన మైకంలో చేతిని, గొంతును బ్లేడుతో కోసుకుని హల్ చల్ చేశాడు.

బ్లేడు
బ్లేడు

గంజాయి, మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఉన్మాది మాదిరిగా ప్రవర్తిస్తూ బ్లేడుతో గొంతు, చేతులు కోసుకున్నాడు. అయ్యో పాపం విపరీతంగా రక్తం కారుతుందేనని సాయం చేద్దామని దగ్గరకొచ్చిన వారిని తరిమేశాడు. కాసేపు అక్కడున్న వారిని తన విపరీత ప్రవర్తనతో భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ ఘటన విజయవాడ పాయికాపురం శాంతి నగర్ లో జరిగింది.

రెడ్డిపల్లి సత్యారావు అనే మాజీ నేరస్తుడు మద్యం తాగి బ్లేడుతో, కత్తి కోసుకున్నాడు. దగ్గరకు ఎవ్వరినీ రానీయకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డ్రగ్స్​కు, మద్యానికి బానిసై మతి స్థిమితం కోల్పోయి ఇలా ప్రవర్తించి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: SUICIDE ATTEMPT: తన వాటా అడిగినందుకు వేధింపులు..దీంతో ఆమె..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.