పిట్టకొంచెం కూత ఘనం అన్న నానుడిని నిరూపిస్తున్నాడు విజయవాడకు చెందిన చిన్నారి నాహీద్ చౌదరి. చదువుతుంది రెండవ తరగతే. కానీ.. విపత్కర సమయంలో సమాజానికి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. మాస్క్, శానిటైజర్ వినియోగంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నాడు. కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయనే కారణంతో మాస్క్‌లు ధరించకుంటే.. వైరస్ వ్యాప్తి జరుగుతుందని నాహీద్ అంటున్నాడు.
ఇదీచదవండి: Ap Junior Doctors Strike: జూడాల చర్చలు సఫలం.. సమ్మె విరమణ