విజయవాడ సెంట్రల్ వైకాపా కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కరోనా లాక్‌డౌన్‌కు ముందు 30వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మార్తీ శ్రీమాహావిష్ణును ప్రకటించిన అధిష్టానం.. ఆయన కరోనాతో చనిపోగా ప్రస్తుతం వేరొకరికి అవకాశం ఇవ్వడంపై మార్తీ సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పుడలా.. ఇప్పుడిలా...
విష్ణు చనిపోగా... అతని కుటుంబీకురాలు మార్తీ సుధారాణిని ప్రచారం చేసుకోమని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేడు మరో అభ్యర్థి జానారెడ్డితో 30వ డివిజన్‌కు నామినేషన్ దాఖలు చేయించారు. ఆగ్రహించిన మార్తీ సుధారాణి ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకొని అనుచరులను నిలదీశారు.
వైకాపా తమకు టికెట్ కేటాయించడం లేదని వారు చెప్పడంతో.. ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తమ వార్డులో కాకుండా వేరొక ప్రాంతంలో నివాసముండే వ్యక్తికి వైకాపా కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఏడాదిగా ప్రజల్లోనే ఉంటూ నిరంతరం సేవ చేస్తున్న తమకు సీటు కేటాయించకపోవడం దారుణమన్నారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: