- Amaravathi Farmers: ఐదో రోజు.. మహా పాదయాత్రకు విశేష స్పందన.. జన సందోహంతో యాత్ర
అమరావతి ఆవశ్యకతను రాష్ట్రవ్యాప్తంగా తెలియజెప్పేందుకు ఓ మహా సంకల్పానికి రాజధాని రైతులు శ్రీకారం చుట్టిన మహాపాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నుంచి నేటి పాదయాత్ర ప్రారంభమైంది. పలు గ్రామాల ప్రజలు, రైతుల నుంచి పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- CBN Letter To SEC:'కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు'..ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. 14వ వార్డు తెదేపా అభ్యర్థి వెంకటేశ్‌పై వైకాపా నేతలు దాడి చేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- RRR: ఆ సినిమాలో చూపించినట్లే నన్ను కూడా హింసించారు: రఘురామ
కస్టడీలో తనను హింసించడంపై దర్యాప్తు కోరినా ఇప్పటివరకు దిక్కులేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. జై భీమ్ సినిమాలో చూపించినట్లే తనను కూడా పోలీసులు హింసించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.' పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- VAT On Petrol: రేపు రాష్ట్రవ్యాప్తంగా భాజపా నిరసనలు
పెట్రో ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని రాష్ట్ర భాజపా డిమాండ్ చేసింది(vat on petrol in andhrapradesh news). ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రేపు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చింది(ap bjp has called for statewide protests). పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సిద్ధూ రాజీనామా ఉపసంహరణ- ఆ పని అయ్యాకే బాధ్యతల స్వీకరణ!
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగనున్నట్లు కాంగ్రెస్‌నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. విచారణ నుంచి వాంఖడే ఔట్
ముంబయి డ్రగ్స్ కేసులో కీలక అధికారిగా ఉన్న సమీర్ వాంఖడేను విచారణ నుంచి తప్పించింది ఎన్సీబీ. దీనితోపాటు మరో ఐదు హై-ప్రొఫైల్ కేసుల నుంచి కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కరోనా చికిత్సకు ఫైజర్ 'పిల్'- 90% తగ్గిన మరణాలు!
కొవిడ్ చికిత్సకు 'పిల్స్'ను(covid pill treatment) రూపొందించేందుకు ఫార్మా సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మెర్క్ సంస్థ అభివృద్ధి చేసిన మాత్రకు బ్రిటన్ ఇప్పటికే అనుమతులిచ్చింది. తాజాగా.. ఫైజర్ కూడా తమ 'పిల్'పై(pfizer pill latest news ) జరిగిన ప్రాథమిక పరీక్షకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'జాక్ మా' కొంపముంచిన మీటింగ్ అదేనా?
'జాక్ మా'.. చైనా అపరకుబేరుడు. అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్త. యువతకు మార్గదర్శి. కానీ అదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడు..? ఆయనో సాధారణ వ్యక్తిలా మారిపోయారు. వ్యవసాయంపై దృష్టి సారించారు. చైనా సర్కార్‌ను విమర్శించడమే ఆయన పాలిట శాపంగా మారింది. అయితే 'మా'ను చైనా అణచివేయడానికి విమర్శలు మాత్రమే కారణం కాదని తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నమీబియాపై కివీస్ ఘన విజయం- సెమీస్ రేసులో ముందడుగు
నమీబియాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో గెలిచి.. సెమీస్ రేసులో ముందడుగు వేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పునీత్ రాజ్‌కుమార్ 'హార్ట్ టచింగ్' పెయింటింగ్
కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth rajkumar death) ఇక లేరనే విషయాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని గీసిన పెయింటింగ్ వైరల్‌గా మారింది. ఆ పెయింటింగ్ చూసిన అభిమానులు హార్ట్ టచింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.