- కార్మిక గర్జన
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన 'ఉక్కు కార్మిక గర్జన' బహిరంగ సభ.. విశాఖపట్నంలోని తృష్ణ మైదానంలో ప్రారంభమైంది. ఉక్కు పరిశ్రమను అమ్మే హక్కు కేంద్రానికి లేదని కార్మిక సంఘం నేతలు స్పష్టం చేశారు. పరిశ్రమలు ప్రైవేటు పరమైతే కార్మిక చట్టాలు కనుమరుగు కావటం ఖాయమన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రైవేట్ సంస్థకు అప్పగింత...
ఇసుక రీచుల్లో తవ్వకాల బాధ్యతల్ని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. రాష్ట్రంలోని ఇసుక రీచులను మూడు ప్యాకేజీలుగా విడగొట్టి వేలం నిర్వహించారు. ఎంఎస్టీసీ (మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్) నిర్వహించిన బిడ్డింగ్‌లో తొలి స్థానంలో నిలిచిన జయప్రకాష్ పవర్ వెంచర్స్.. 3 ప్యాకేజీలనూ దక్కించుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కలకలం
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం మహాగర్జనకు సర్వం సిద్ధమైన వేళ.. శ్రీనివాసరావు అనే ప్లాంట్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటానంటూ రాసిన లేఖ కలకలం రేపుతోంది. గాజువాకకు చెందిన శ్రీనివాసరావు.. ఉక్కు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతవుతానంటూ రాసిన లేఖ లభ్యమైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వాణీదేవి గెలుపు
మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు పూర్తయింది. ఈ ఉత్కంఠ పోరులో తెరాస అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. ఈ మేరకు ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'టీ పరిశ్రమను నాశనం చేసే వారితో కాంగ్రెస్ జట్టు'
అసోంలో తేయాకు రంగాన్ని నాశనం చేయాలనుకునే వారికే కాంగ్రెస్ మద్దతునిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అసోం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విజయం వరించేనా?
తొలిసారి అసెంబ్లీ బరిలో ఉన్న కమల్ హాసన్.. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు తెచ్చిపెట్టిన ఈ స్థానం తనకు కలిసొస్తుందని భావిస్తున్నారు. మరి ఈ స్థానం నుంచి పోటీలో ఉన్న ఇతర పార్టీ అభ్యర్థులెవరు? కమల్ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారీ విరాళం
వాతావరణ మార్పులకు అనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రవేశపెట్టిన సీడీఆర్ఐకి అమెరికా మద్దతు తెలిపింది. రూ. 66 కోట్లు విరాళం ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 409 పాయింట్లకు పైగా పుంజుకుంది. ప్రస్తుతం 49,626 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ-నిఫ్టీ 120పాయింట్ల లాభంతో 14,6678 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కుమ్మేసిన టీమ్ఇండియా
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక టీ20లో టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లు రోహిత్, విరాట్ అర్ధ సెంచరీలతో రెచ్చిపోగా.. మిగతా బ్యాట్స్మెన్లు సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రోహిత్@2
భారత ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో మరో ఫీట్ సాధించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్తిల్‌ను అధిగమించాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సినిమా ముచ్చట్లు
కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'రంగ్ దే' ప్రీ రిలీజ్, సుల్తాన్ ట్రైలర్, 'జాతిరత్నాలు' వీడియో సాంగ్ గురించి ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.