- తితిదే వార్షిక బడ్జెట్
తితిదే 2021-2022 సంవత్సరానికి 2,937.82 కోట్ల రూపాయల అంచనాతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
- అక్రమ కేసులు బనాయిస్తున్నారు: చంద్రబాబు
పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పరిణామాల్లో తెదేపా సానుభూతిపరులపై ఓ వర్గం పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
- 'చీకటి ఒప్పందాలు'
ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకొని స్టీల్ ప్రైవేటీకరణకు అనుకూలంగా వ్యవహరించిందని తెదేపా నేతలు ఆరోపించారు. పరిశ్రమ ప్రైవేటీకరణ విషయం ముందే తెలిసినా.. వైకాపా ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
- కౌంట్‌డౌన్ ప్రారంభం
శ్రీహరి కోటలోని షార్ నుంచి.. పీఎస్ఎల్వీ-సీ 51 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1 ఉపగ్రహాన్ని.. పీఎస్ఎల్వీ.. రేపు నింగిలోకి తీసుకువెళ్లనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
- కరోనా టీకా ధర రూ.250
కరోనా టీకా ధరను 150 రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. సర్వీస్ ఛార్జీ రూ.100తో కలిపి టీకా డోసు ధర 250 రూపాయలకు మించొద్దని ఆదేశించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేసే టీకా ఉచితం కాగా..ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ధరను ప్రజలే చెల్లించాలని కేంద్రం స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
- 'చైనాను చూసి భయపడుతున్నారు'
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చైనాను చూసి భయపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్-చైనా సరిహద్దు వివాదంపై మాట్లాడిన రాహుల్.. ప్రధాని అసమర్థత కారణంగానే భారత్ భూభాగంలోకి డ్రాగన్ వచ్చిందని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'చర్చలకు సిద్ధం'
నియంత్రణ రేఖ వెంబడి శాంతి నెలకొల్పే దిశగా భారత్-పాక్ తీసుకున్న నిర్ణయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. భారత్-పాక్ నిర్ణయం నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక చర్యలు ఆగవని ఉత్తర కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వివరాలు వెల్లడి
సామాజిక మాధ్యమాలపై.. ఐటీ నిబంధనల వివరాలను కేంద్రం వెల్లడించింది. 50 లక్షలకుపైగా వినియోగదారులు ఉన్న మాధ్యమాలకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారత మహిళా జట్లు ఇవే
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు భారత మహిళల జట్టును ప్రకటించింది యాజమాన్యం. మార్చి 7 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. మార్చి 20 నుంచి పొట్టి ఫార్మాట్ మొదలవుతుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సినిమా ముచ్చట్లు
కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో లవ్‌స్టోరి, సునీల్ కొత్త సినిమా, ఈ కథలో పాత్రలు కల్పితం చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.