ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9pm

.

9pm_Topnews
ప్రధాన వార్తలు @ 9pm
author img

By

Published : Dec 24, 2020, 9:00 PM IST

  • క్షమాపణలు కోరిన సీఎం

గండికోట నిర్వాసితులను సీఎం జగన్​మోహన్​రెడ్డి క్షమాపణ కోరారు. ఏనాడూ గండికోట రిజర్వాయర్​లో 12 టీఎంసీల నీటి నిల్వ ఉంచే పరిస్థితి లేదని అన్నారు. ముంపువాసులు చిరునవ్వు చిందించేలా ఆదుకోవాలని సీఎం జగన్ జగన్ కడప కలెక్టర్​కు ఆదేశించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • తాడిపత్రిలో ఉద్రిక్తత

తాడిపత్రి మరోసారి భగ్గుమంది. ఏకంగా వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికెళ్లి అనుచరులతో హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో జేసీ వర్గీయుడిపై పెద్దారెడ్డి మనుషులు దాడి చేయడం ఉద్రిక్తలను రాజేసింది. ఈ ఘటనపై ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఆ మాటలు ఎక్కడ'

గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆడపిల్లల పాలిట మేనమామగా ఉంటానన్న వ్యక్తి .. వారి పట్ల కంసుడిలా తయారయ్యారని మండిపడ్డారు. అనంతపురంలో హత్యకు గురైన స్నేహలత కుటుంబానికి తెదేపా తరఫున 2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • తాత్కాలిక జప్తు

హైదరాబాద్‌ అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలోని రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను అటాచ్‌ చేసింది. ఏపీలోని సుమారు 48 ఎకరాల్లోని హాయ్‌లాండ్‌ ఆస్తులను స్వాధీన పరుచుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కర్ఫ్యూ పై వెనక్కి

రాత్రి పూట కర్ఫ్యూ నిర్ణయాన్ని కర్ణాటక వెనక్కు తీసుకుంది. కర్ఫ్యూపై ప్రజల అభిప్రాయం మేరకు మంత్రివర్గం భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'సమాచారం పంచుకునేందుకు సిద్ధం'

ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం శాస్త్ర, సాంకేతిక సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి భారత్​ ఎల్లప్పుడూ ముందుంటుందని కేంద్ర మంత్రి హర్ష వర్ధన్​ తెలిపారు. ఐఐఎస్​ఎఫ్-2020 లో పాల్గొనడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • భిన్న వాదనలు

అమెరికాలో రాజకీయ నాయకులు కరోనా టీకా ముందుగా తీసుకునే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ఆరోగ్య కార్యకర్తలు, సీనియర్లకే టీకా అందించడం ముఖ్యమని కొంత మంది చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఫాస్ట్​ట్యాగ్ తప్పనిసరి

వచ్చే జనవరి 1 నుంచి అన్ని రకాల వాహనాలకు ఫాస్ట్​ట్యాగ్​ తప్పనిసరి చేసింది కేంద్రం. దీనివల్ల టోల్​గేట్ల వద్ద రుసుం చెల్లించేటప్పుడు రద్దీ తగ్గుతుందని తెలిపింది. వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతుందని పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • శుభవార్త

‘మిస్టర్‌ ఐపీఎల్‌’గా పేరుపొందిన రైనాతో చెన్నై సూపర్‌కింగ్స్‌ సంబంధాలేమీ తెంచుకోవడం లేదని తాజా సమాచారం. వచ్చే ఏడాది అదే జట్టు తరఫున అతడు ఆడనున్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • లాక్​డౌన్​లో ఇరుక్కుపోయింది

బాలీవుడ్​ బ్యూటీ ప్రియాంక చోప్రా లండన్​లో విధించిన లాక్​డౌన్​లో చిక్కుకుపోయింది. ఓ హాలీవుడ్​ సినిమా షూటింగ్​ కోసం వెళ్లిన ప్రియాంక.. అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.