ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 9PM - ప్రధాన వార్తలు

.

9pm top news
9pm top news
author img

By

Published : Aug 11, 2020, 9:04 PM IST

  • ఉత్తరం.. ప్రత్యుత్తరం

కృష్ణా నదీ నీటి పంపకాల్లో తెలంగాణ, ఏపీ మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ రాసిన లేఖపై సీఎం ప్రత్యుత్తరమిచ్చారు. కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని సీఎం జగన్‌ వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అంతా విఫలమే..!

జగన్ ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కరోనా నివారణ చర్యల్లో వైకాపా సర్కారు ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో భూములకు భద్రత... ప్రాణాలకు రక్షణ ఏదనీ చంద్రబాబు నిలదీశారు. కరోనాలో అమెరికా, బ్రెజిల్ స్థాయికి ఏపీకి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐఎంఏ లేఖ

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్... డీజీపీ గౌతమ్ సవాంగ్​కు లేఖ రాసింది. స్వర్ణ ప్యాలెస్ చాలా కాలం వరకు స్టార్ హోటల్​గా ఉంది. అక్కడ అన్ని అనుమతులూ ఉండే ఉంటాయని భావించి. అక్కడి పరిస్థితులు పరిశీలించకుండానే వైద్యారోగ్య శాఖ అనుమతులిచ్చి ఉంటుందని భావించడం లేదని లేఖలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైకాపా ఎమ్మెల్సీ ఆయనే..!

ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి పెన్మత్స సురేష్​బాబు పేరును సీఎం జగన్​ ఖరారు చేశారు. ఈయన విజయనగరం జిల్లా సీనియర్​ నేత పెన్మత్స సాంబశివరాజు తనయుడు. ఇప్పటికే ఎన్నికకు నోటిఫికేషన్​ జారీ అయ్యింది. ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కాంగ్రెస్​ విధేయుడినే

దాదాపు నెల రోజుల అనంతరం జైపుర్​లో అడుగుపెట్టారు కాంగ్రెస్​ నేత సచిన్​ పైలట్​. ఆయనకు మద్దతుదారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను కాంగ్రెస్​ కార్యకర్తనేనని.. పార్టీ ఏం చెబితే అది చేయడానికి సిద్ధమని వెల్లడించారు. ప్రతీకార రాజకీయాలకు మాత్రం చోటు ఉండకూడదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • కరోనా ఉద్ధృతి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభిస్తోంది. తమిళనాడులో కొత్తగా 5,834కేసులు వెలుగుచూశాయి. ఉత్తర్​ప్రదేశ్​లో రికార్డు స్థాయిలో 5,041 కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • పోలీసులతో జడేజా సతీమణి వాగ్వాదం

టీమ్​ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా చిక్కుల్లో పడింది. మాస్క్ ధరించలేదని ప్రశ్నించగా ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగిందని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • స్టైలిష్ చిత్రాల దర్శకుడితో అక్కినేని హీరో!

అక్కినేని యువ హీరో అఖిల్ తన ఐదో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.