ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - టాప్ న్యూస్

.

9pm top news
9pm top news
author img

By

Published : Aug 4, 2020, 8:59 PM IST

  • తగ్గని కరోనా
    రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 9,747 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,76,333కు చేరింది. కరోనాతో మరో 67 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,604మంది మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • హైకోర్టుకు హారతులు
    రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్ణయంపై అమరావతి ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టుకు హారతులిచ్చారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు స్టేటస్‌ కో విధించడాన్ని స్వాగతించారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని, కోర్టు తమ హక్కులను కాపాడుతుందని రైతులు, మహిళలు, యువత పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • నిందితుడు అరెస్ట్
    అప్పు తీర్చలేదనే కారణంతో మహిళను ట్రాక్టర్​తో తొక్కించి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై హత్యకేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • ఆగస్టు 5 ప్రత్యేక దినం
    అయోద్య రామమందిరం భూమి పూజ కార్యక్రమంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. ఆగస్టు 5 భారతీయ చరిత్రలో ప్రత్యేక దినంగా మిగిలిపోతుందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్​
    కేంద్ర మంత్రులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు సోమవారం కరోనా సోకింది. తాజాగా .. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​కు కరోనా సోకింది. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • తమిళనాడులో పెరుగుతున్న కేసులు.. దిల్లీలో తగ్గుముఖం
    దేశంలో కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతోంది. రోజుకు 50 వేల పైనే కొవిడ్​ కేసులు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో వైరస్​ బాధితులు పెరుగుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • ఆ బాధ్యత లాల్​ కుటుంబానిదే!
    రామమందిర భూమిపూజ కోసం అయోధ్య నగరం సిద్ధమైంది. బుధవారం జరగనున్న వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమం కోసం రామ్​లల్లాకు ప్రత్యేకమైన దుస్తులు రూపొందించారు. వాటి విశేషాలు ఓసారి చూద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్​ఓ-చైనా పరిశోధన
    కరోనా మహమ్మారి మూలాన్ని కనుగొనేందుకు ప్రణాళికలు రూపొందించే విషయంపై చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చలు జరిపాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇద్దరు నిపుణులు చైనాలో.. రెండు వారాల పాటు సందర్శించారని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. వీరి పర్యటన ఆదివారంతో పూర్తయినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • అనుష్క ఏం చేస్తుందంటే?
    భారత క్రికెట్​ కెప్టెన్​ విరాట్​ కోహ్లీని విసిగించడమంటే ఎంతో ఇష్టమని అతని సతీమణి అనుష్క శర్మ తెలిపింది. ఇటీవలే ఇన్​స్టాగ్రామ్​లో అభిమానులతో ముచ్చటిస్తూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • ధోనీ కామెంట్లు చేసేవాడు
    టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ సరదా కామెంట్లతో తనను ఆటపట్టించేవాడని అన్నాడు భారత పేసర్​ ఇషాంత్​ శర్మ. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.