రాష్ట్రంలో కొత్తగా... 24 గంటల వ్యవధిలో 7,627 కరోనా కేసులు నమోదయ్యాయి. మెుత్తం బాధితుల సంఖ్య 96 వేల 298కి చేరింది. వైరస్ కారణంగా మరో 56 మంది మృతి చెందగా.. మెుత్తం మరణాలు 1041కు చేరాయి. రాష్ట్రంలో తాజాగా 47 వేల 645 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 16,43,319 కరోనా పరీక్షలు చేశారు. ఆస్పత్రుల్లో 48 వేల 956 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 46 వేల 301 మంది డిశ్ఛార్జి అయ్యారు.
జిల్లా | నమోదైన కేసులు |
కర్నూలు | 1,213 |
తూర్పుగోదావరి | 1,095 |
పశ్చిమగోదావరి | 859 |
విశాఖ | 784 |
అనంతపురం | 734 |
చిత్తూరు | 573 |
గుంటూరు | 547 |
కడప | 396 |
కృష్ణా | 332 |
నెల్లూరు | 329 |
శ్రీకాకుళం | 276 |
విజయనగరం | 247 |
ప్రకాశం | 242 |
కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో 9, విశాఖ 8 మంది మృతి చెందగా... కర్నూలు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో ఐదుగురు మృతి బలయ్యారు. నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ఐదుగురు చొప్పున చనిపోయారు. వైరస్‌తో చిత్తూరు జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో ముగ్గురు, అనంతపురం, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా..గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చదవండి: ఏపీలో ఆ కుటుంబానికి ట్రాక్టర్ కొనిస్తా: సోనూసూద్