రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 664 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 835 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 8.56 లక్షల మందికి చేరింది. తాజాగా వైరస్ కారణంగా 11 మంది మృతి చెందగా.. మెుత్తం మరణాల సంఖ్య 7,014 చేరాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6,742 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 63,049 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 1,02,29,745 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు