చిన్న పిల్లలకు సంక్రమించే అంటు వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న 22వ జాతీయ స్థాయి సదస్సుకు రామోజీ ఫిలింసిటీ వేదిక కానుంది. నవంబరు 1 నుంచి 3వ తేదీ వరకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చిన్న పిల్లల వైద్యుల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర నిర్వాహకులు డాక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. చిన్న పిల్లల వైద్యుల సమాఖ్య, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో అంటువ్యాధులు నివారణ... ఇటీవల పెరిగిన డెంగీ,మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తామన్నారు. సదస్సుకు సంబంధించిన గోడపత్రికను ఇవాళ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దాదాపు 80 మంది ప్రముఖ వైద్య నిపుణులతో పాటు 600 మంది వైద్యులు పాల్గొంటారని డాక్టర్ సుదర్శన్, డాక్టర్ రంగయ్య తెలిపారు. వైద్య విద్యార్థులు, ఇతర వైద్యులు ఈ సదస్సును వినియోగించుకోవాలని సూచించారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో జాతీయ చిన్నపిల్లల అంటువ్యాధుల సదస్సు - 22nd national conference of pediatric infectious diseases in ramoji film city
22వ జాతీయ చిన్న పిల్లల అంటువ్యాధుల సదస్సు మూడు రోజుల పాటు రామోజీ ఫిలింసిటీలో జరగనుంది. చిన్న పిల్లల వైద్యుల సమాఖ్య, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఇవాళ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.