ETV Bharat / city

విజయవాడలో జాతీయ మిల్లి కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం - జాతీయ మిల్లి కౌన్సిల్‌ 20వ సర్వసభ్య సమావేశం

విజయవాడలో జాతీయ మిల్లి కౌన్సిల్‌ 20వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానకి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా హాజరై...భారత రాజ్యాంగ పరిరక్షణ, దేశ నిర్మాణానికి ప్రతి ఒక్క ముస్లిం ఐక్యంగా నిలవాలని కోరారు.

మిల్లి కౌన్సిల్‌ 20వ సర్వసభ్య సమావేశం
author img

By

Published : Oct 19, 2019, 4:58 PM IST

భారత రాజ్యాంగ పరిరక్షణ, దేశ నిర్మాణానికి ప్రతి ఒక్క ముస్లిం ఐక్యంగా నిలవాలని ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అంజాద్‌బాషా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని- స్వాతంత్య్రం కోసం... మతాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా పోరాడి ఆ ఫలాలు సాధించారని చెప్పారు. స్వాతంత్య్రం అనంతరం రచించిన రాజ్యాంగానికి తూట్లు పడిచే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తుండడం బాధాకరంగా ఉందని ఆయన విజయవాడలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన జాతీయ మిల్లి కౌన్సిల్‌ 20వ సర్వసభ్య సమావేశంలో వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరయ్యారు. 1992లో ఏర్పాటైన మిల్లి కౌన్సిల్‌... దేశంలోని ముస్లింలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారానికి- వాస్తవ అంశాలపై అవగాహనకు ప్రయత్నం చేస్తోందన్నారు. ఏ మతానికి చెందిన వారు వారి వారి సంప్రదాయాలు పాటించే హక్కు రాజ్యాంగం కల్పించిందని- ఆ హక్కులను కాలరాసే చర్యలు దురదృష్టకరమన్నారు. నిరక్షరాస్యత, పేదరికం నిర్మూలనకు అంతా పాటుపడాలని కోరారు. మూడు రోజులపాటు వివిధ అంశాలపై ఈ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించి తీర్మానాలు చేస్తారు.

జాతీయ మిల్లి కౌన్సిల్‌ 20వ సర్వసభ్య సమావేశం

ఇదీచదవండి

రాజధానిపై సీఎంను నిలదీయండి: పంచుమర్తి అనురాధ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.