ఉన్నత విద్యా సంస్థల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 విద్యా సంవత్సరానికి గానూ ఈ రిజర్వేషన్లు వర్తించేలా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో వర్తింప చేయాలని ఆదేశాలిచ్చింది. ఐదు ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉన్న వారికి , వెయ్యి గజాల నివాస స్థలం కలిగిన వారికి, మున్సిపాలిటీల్లో 100 గజాల కంటే ఎక్కువ నివాస స్థలం ఉన్న వారికి ఈ రిజర్వేషన్లు వర్తించబోవని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాకుండా ఇతర వర్ణాల్లోని పేదలు ఈ రిజర్వేషన్ల కింద అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి.. 'ట్రిపుల్ తలాక్ బిల్లుకు వైకాపా వ్యతిరేకం'