తిరుమల వెంకన్న ఆస్తులు, శ్రీవారికి భక్తులు కానుకల విక్రయాన్ని నిషేధిస్తూ తితిదే ధర్మకర్తల మండలి... తీర్మానం చేసింది. ఆస్తుల విక్రయంపై చెలరేగిన వివాదంలో కుట్రకోణం ఏమైనా ఉందా అని దర్యాప్తు చేయాలని....... ప్రభుత్వాన్ని కోరింది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించాక వీలైనంత త్వరగా దర్శనాలు పునరుద్ధరిస్తామని తెలిపింది.
శ్రీవారి స్థిరాస్తుల విక్రయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వెనక్కి తగ్గింది. వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని తితిదే బోర్డు.. భూముల విక్రయ వివాదం సహా పలు అంశాలపై చర్చించింది. తితిదే ఆస్తుల అమ్మకాన్ని... నిషేధించించాలని, నిరుపయోగంగా ఉన్న స్థలాలను వినియోగంలోకి తేవడంపై పాలక మండలి సభ్యులు, స్వామీజీలు మేధావులతో కమిటీ వేయాలని నిర్ణయించింది.
కరోనా నేపథ్యంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో.. మార్పులను పరిశీలించిన సుబ్బారెడ్డి దర్శనాల పునరుద్ధరణపై ప్రభుత్వ అనుమతి కోసం నిరీక్షిస్తున్నట్లు....చెప్పారు. తిరుమలలో...కాలపరిమితి తీరిన ప్రైవేటు వసతి గృహాల పునర్నిర్మాణ కేటాయింపులకు విధివిధానాలు రూపొందించాలని ఆధికారుల్ని ఆదేశించామని సుబ్బారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నీలోఫర్ తరహాలో తిరుపతిలో చిన్నపిల్లల కోసం ఒక ఆస్పత్రి నిర్మించనున్నట్లు తెలిపారు.
ఇది చదవండి: రంగుల అంశంపై హైకోర్టుకు సీఎస్, పంచాయతీ ముఖ్య కార్యదర్శి