Fraud Phone Call: రుణాల పేరుతో మోసానికి యత్నించిన ఓ వ్యక్తిపై తిరుపతి ఎంపీ గురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అభిషేక్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి..,తాను సీఎంవోలో పనిచేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నారన్నారు. ఖాదీపరిశ్రమ శాఖలో రాయితీ రుణాలు మంజూరు చేయిస్తానని..,తన ఖాతాలో రూ.20 లక్షలు వేయాలని అభిషేక్ కోరారని గురుమూర్తి వెల్లడించారు. 20 యూనిట్లకు రాయితీపై రుణం మంజూరు చేయిస్తానని అభిషేక్ నమ్మబలికాడని తెలిపారు. ఫోన్ కాల్‌పై తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పొలిటికల్ రీ ఎంట్రీపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు