ETV Bharat / city

తిరుపతిలో ఆదరణ మహిళా సాధికారత క్యాంపైన్

తిరుపతి అర్బన్ పోలీసులు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ఆదరణ మహిళా సాధికారత క్యాంపైన్ నిర్వహించారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో మహిళలకు భరోసా ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

Women Empowerment Campaign conducted in Tirupati

author img

By

Published : Oct 2, 2020, 10:12 PM IST

గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి అర్బన్ పోలీసులు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ఆదరణ మహిళా సాధికారత క్యాంపైన్ నిర్వహించారు. తిరుమల బైపాస్ రోడ్డులో ఉన్న ప్రకాశం పార్క్‌లో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. సాధికారత క్యాంపైన్‌లో తిరుపతి శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా, అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డితో పాటు తిరుపతి నగరానికి చెందిన పలువురు మహిళా ప్రముఖులు పాల్గొన్నారు.

Women Empowerment Campaign conducted in Tirupati
కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు

'స్త్రీకి మనసు ఉంది, ఆలోచించగలుగుతుంది, స్త్రీ సమానత్వం, స్వేచ్ఛ వంటి అంశాలపై పోరాడిన చలంను వేదిక నుంచి స్మరించుకోవాలని శాసనసభ్యుడు కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఆదరణ పేరుతో తిరుపతి పోలీసులు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. మహిళలకు ఏ ఆపద వచ్చిన ఆదుకోవడానికి గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులు అందుబాటులో ఉంటారని ఆయన వివరించారు.

ఇదీ చదవండి

కరోనా కాలం.. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.