...
Bus accident: చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా.. తొమ్మిది మంది మృతి - bus overturns in Bhakarapeta valley
15:04 March 27
మంత్రి పెద్దిరెడ్డి పరామర్శ
23:29 March 26
అనంతపురం జిల్లా నుంచి తిరుపతికి నిశ్చితార్థానికి వస్తుండగా దుర్ఘటన
Bus accident: ఆడుతూ పాడుతూ ఆనందంగా నిశ్చితార్థ వేడుకకు బయలుదేరిన వారిని రోడ్డు ప్రమాదం మృత్యురూపంలో కబళించింది. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుతారనగా.. వారి బతుకులు బోల్తాపడ్డాయి. చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటనలో 9 మంది కన్నుమూశారు. 55 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ తిరుపతిలోని రుయా, స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
60 అడుగుల లోయలోకి.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట వద్ద పెళ్లిబృందంతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తాపడి చిన్నారి సహా ఎనిమిది మంది చనిపోయారు. బస్సు సుమారు 60 అడుగుల లోతు లోయలోకి పడిపోవడంతో ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. బస్సు కిందపడి ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో చిన్నారి నారావారిపల్లె ప్రాథమిక ఆస్పత్రిలో, ఆదినారాయణరెడ్డి , నాగలక్ష్మి రుయా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. పెళ్లికుమారుడు సహా తీవ్రంగా గాయపడిన 46 మందిని తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు రుయా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
నిశ్చితార్థం వేడుకకు వెళుతూ.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం కాగా.. నేడు ఉదయం 9 గంటలకు తిరుచానూరులో నిశ్చితార్థం వేడుక జరగాల్సి ఉంది. పెళ్లికుమారుడు బంధువులతో కలిసి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ధర్మవరం నుంచి బయలుదేరారు. ప్రయాణమంతా ఆడుతూ, పాడుతూ సాఫీగా సాగుతుండగా.. రాత్రి 9 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న బస్సు భాకరాపేట ఘాట్‌రోడ్డులోకి ప్రవేశించింది.
దొనకోటి గంగమ్మ గుడి దాటిన తర్వాత డ్రైవర్ అతివేగంతో బస్సు నడపడంతో పెద్దమలుపు వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా 60 అడుగుల లోతు ఉన్న లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్‌తోపాటు ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. చిన్నారి సహా మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. బస్సులో ఉన్న అందరికీ తీవ్ర గాయాలయ్యాయి.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరగడంతో రాత్రి పదిన్నర వరకు వెలుగుచూడలేదు. క్షతగాత్రుల హాహాకారాలతో అటుగా వెళ్తున్న వాహనచోదకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులతో కలిసి పోలీసులు గాయపడిన వారందరినీ బయటకు తీశారు. అంబులెన్స్‌లో తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఆస్పత్రిలోనూ ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసి తక్షం వైద్యసాయం అందించారు.
నిశ్చితార్థం జరగాల్సిన వేణు కుటుంబసభ్యుల్లో.. అతని తాత మలిశెట్టి వెంగప్ప, తండ్రి మలిశెట్టి మురళి, బాబాయి మలిశెట్టి గణేశ్, పిన్ని కాంతమ్మ మరణించారు. వీరితోపాటు డ్రైవర్ నబీ రసూల్, క్లీనర్ సైతం ఘటనాస్థలంలోనే చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి యశశ్విని కన్నుమూసింది. గాయపడిన వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. మృతదేహాలకు తిరుపతి రుయా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
శవపరీక్షలు పూర్తి : చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద బస్సు లోయలో పడి చనిపోయిన.. 8మంది మృతదేహాలకు శవపరీక్షలు పూర్తయ్యాయి. మృత దేహాలను... మూడు వాహనాల్లో అనంతపురం జిల్లా ధర్మవరం తరలించారు. మృతులు మలిశెట్టి వెంగప్ప, మలిశెట్టి మురళి, కాంతమ్మ, మలిశెట్టి గణేశ్, ఆదినారాయణరెడ్డి, జె.యశస్విని, బస్సు డ్రైవర్ నబీ రసూల్, క్లీనర్ మృత దేహాలను వారి బంధువులకు అప్పచెప్పారు. ధర్మవరంలో ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మంత్రి పెద్దిరెడ్డి పరామర్శ: భాకరాపేట ప్రమాద బాధితులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. తిరుపతి రుయా ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. బాధితులను పలకరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. భాకరాపేట ఘాట్‌రోడ్డులో ప్రమాదాలు జరగకుండా రక్షణ గోడ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: Wedding bus accident: పెళ్లి బస్సు బోల్తా- 30 మందికి గాయాలు