ETV Bharat / city

TTD: జమ్ము నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు: సుబ్బారెడ్డి - TTD News

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 500 ఆలయాలు నిర్మిస్తామని తితిదే ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శ్రీవారి పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి
తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి
author img

By

Published : Jun 19, 2021, 3:30 PM IST

Updated : Jun 20, 2021, 6:26 AM IST

కొవిడ్‌ పరిస్థితులను సమీక్షించుకుంటూ భక్తులకు జారీ చేసే దర్శన టికెట్ల కోటాను పెంచుతామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 5వేల మందికి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లను మంజూరు చేశామని, పరిస్థితులకు అనుగుణంగా మరో 5వేలు పెంచుతామని తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌తో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఆదేశాలను అనుసరించి ఎల్‌1, ఎల్‌2 దర్శనాలను రద్దు చేసి సామాన్య భక్తులకు త్వరగా స్వామి దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. కొవిడ్‌ కారణంగా కొన్ని నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటన్నింటినీ రానున్న ఏడాది కాలంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దళితులు ఉండే ప్రాంతాల్లో 500 ఆలయాలు నిర్మించాలని అనుకున్నా చేయలేకపోయినట్లు చెప్పారు. ఆలయాల నిర్మాణానికి ఎక్కడ వినతులు వచ్చాయో అక్కడ వాటిని ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు ఆయన మాటల్లోనే..

‘ప్రకృతి వ్యవసాయ’ పంటలతో నైవేద్యం
ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలతో స్వామి వారికి తయారు చేస్తున్న నైవేద్యం కార్యక్రమాన్ని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో ధర్మప్రచార పరిషత్‌ ద్వారా రైతులను సంసిద్ధం చేసి వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఇందుకు అన్ని జిల్లాల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం.

- వారణాసి, ముంబయిలోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయించినా భూసేకరణ పూర్తి కాలేదు.

-తితిదేలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసేందుకు ఇప్పటికే కమిటీని నియమించాం. అన్ని విభాగాల్లోని వారికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు శాశ్వత చర్యలు చేపట్టనున్నాం. ఇందుకోసం తితిదేలోనే ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం.

- తిరుమలలోని హనుమంతుని జన్మస్థలాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

- త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్విమ్స్‌, బర్డ్‌ ఆసుపత్రుల పనులకు శంకుస్థాపన చేయించే కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. తిరుమలలో కొత్తగా నిర్మించిన బూందీపోటును సీఎం ప్రారంభిస్తారు.

- తిరుమలను గ్రీన్‌హిల్స్‌గా ప్రకటించినందుకు ఉచిత బస్సుల స్థానంలో 20 విద్యుత్తు బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నాం. ఆర్టీసీ ద్వారా 100 విద్యుత్తు బస్సులను నడిపేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. త్వరలోనే తిరుపతి-తిరుమల మధ్య వీటిని నడపనున్నారు. ప్రైవేటు ట్యాక్సీలు నడిపే వ్యక్తులు సైతం విద్యుత్తు వాహనాలుగా మార్పు చేసుకునేందుకు ముందుకు వచ్చి తమను సంప్రదిస్తే వారికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తాం.

- గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, దిల్లీ రాష్ట్రాల్లో 100 ఆలయాలకు గోవులను అందించాం. మరో 40 ఆలయాలకు త్వరలోనే అందజేస్తాం. రాష్ట్రంలో కొత్తగా 13 కల్యాణ మండపాల నిర్మాణానికి ఆమోదముద్ర వేశాం. రాబోయే 3 నెలల్లో కన్నడ, హిందీ ఛానళ్ల ప్రసారాలను ప్రారంభించాలని నిర్ణయించాం.

తితిదే ఛైర్మన్‌గా మరో ఏడాది వైవీ?

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఛైర్మన్‌గా వై.వి.సుబ్బారెడ్డినే మరో ఏడాది పాటు కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఆదివారం లేదా సోమవారం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది. తితిదే పాలక మండలి ఛైర్మన్‌గా వై.వి.సుబ్బారెడ్డి 2019 జూన్‌ 21న నియమితులయ్యారు. ఆయన పదవీకాలం సోమవారంతో ముగుస్తోంది. ఛైర్మన్‌గా ఆయననే కొనసాగిస్తారా, వేరే ఎవరికైనా అవకాశమిస్తారా? అన్న అంశంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. దీనికి తెరదించుతూ,ఆయననే మరో ఏడాది ఛైర్మన్‌గా కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుత పాలక మండలి సభ్యుల్లో కొందర్ని మార్చి, కొత్తవారిని నియమించే అవకాశమున్నట్లు సమాచారం.

ఇదీ చదవండీ... EAMCET: ఎంసెట్‌కు బదులుగా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Last Updated : Jun 20, 2021, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.