కరోనా విపత్కర పరిస్థితుల్లో మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ మంగళవారం తిరుమలలో సాంగోపాంగ అష్టాక్షరీ, ద్వాదశాక్షరీ మహాసుదర్శన సహిత విశ్వశాంతి హోమం నిర్వహించారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో... ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా "ఓం నమో నారాయణాయ" అష్టాక్షరి మంత్రాన్ని, "ఓం నమో భగవతే వాసుదేవాయ" ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపిస్తూ హోమం జరిపారు. భౌమాశ్విని యోగం రోజున ఈ మంత్రాలను పఠించిన వారికి కోటి రెట్ల ఫలితం కలుగుతుందని వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు మోహనరంగాచార్యులు తెలిపారు
ఇదీ చదవండి :