తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, రాష్ట్ర మంత్రి జోగి రమేష్, రాష్ట్ర భాజపా సహా ఇంఛార్జ్ సునీల్ థియోధర్, గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర కామత్, కర్ణాటక మాజీ మంత్రి రేవన్నాలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇవీ చూడండి :