ETV Bharat / city

న్యూదిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఇవే తేదీలు!

న్యూ దిల్లీలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో.. వార్షిక బ్రహ్మోత్సవాలను మే 23 నుంచి 31 వరకు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తితిదే ప్రకటించింది.

author img

By

Published : May 12, 2021, 4:30 PM IST

న్యూదిల్లీలోని శ్రీవారి ఆలయం
న్యూదిల్లీలోని శ్రీవారి ఆలయం

న్యూ దిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. తితిదే అనుబంధ ఆలయమైన శ్రీవారి ఆలయంలో మే 23 నుంచి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఉత్సవాలకు మే 22న‌ సాయంత్రం అంకురార్పణం జ‌రుగ‌నుంది. కొవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్యల్లో భాగంగా… ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.

అంతకు ముందు మే 18వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 23వ తేదీ ఉదయం 7 నుంచి 8 గంటల వ‌ర‌కు వృష‌భ ల‌గ్నంలో ధ్వజారోహణంతో వాహన సేవలను ప్రారంబిస్తారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. జూన్ 1వ తేదీన సాయంత్రం 5 నుంచి 6 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు:

తేదిఉదయంసాయంత్రం
23-05-2021ధ్వజారోహణంపెద్ద‌శేష వాహనం
24-05-2021చిన్న‌శేష వాహ‌నంహంస వాహనం
25-05-2021సింహ వాహ‌నంముత్య‌పుపందిరి వాహ‌నం
26-05-2021క‌ల్ప‌వృక్ష వాహ‌నంస‌ర్వ‌భూపాల వాహనం
27-05-2021మోహినీ అవ‌తారంక‌ల్యాణోత్స‌వం, గ‌రుడ వాహ‌నం
28-05-2021హ‌నుమంత వాహ‌నంగజవాహనం
29-05-2021సూర్య‌ప్ర‌భ వాహ‌నంచంద్ర‌ప్ర‌భ వాహ‌నం
30-05-2021ర‌థోత్స‌వంఅశ్వ వాహ‌నం
31-05-2021చక్రస్నానంధ్వజావరోహణం

ఇదీ చదవండి:

కొవిడ్​ కేంద్రం నుంచి 25 మంది రోగులు పరార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.