లాక్డౌన్ ప్రభావం మూగజీవాలపైనా కనిపిస్తోంది. తిరుపతిలో చాలా వరకూ రహదారుల్లో మూగజీవాలు ఆహారం దొరక్క దీనావస్థను అనుభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మానవతా దృక్పథంతో ముందుకు వస్తున్నారు. ఆకలితో ఉన్న నిరుపేదలకు ఆహారం అందిచటంతో పాటు మూగజీవాల ఆకలినీ తీరుస్తున్నారు. తిరుపతిలోని అలిపిరిలో సిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో మూగజీవాలకు కాయగూరలను ఆహారంగా అందించారు. టమాటాలు, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్లతో వాటి ఆకలి తీర్చారు. నిరుపేదలను ఆదుకోవటంతో పాటు పశుసంపదను కాపాడుకోవటంపైనా దాతలు దృష్టి పెట్టాలని వారు కోరారు.
ఇదీ చదవండి: 'ఆందోళన... కరోనా కన్నా ప్రమాదకరం'